Homeటాప్ స్టోరీస్నాని జెర్సీ ట్రైలర్ రాబోతోంది

నాని జెర్సీ ట్రైలర్ రాబోతోంది

న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం రిలీజ్ కి సిద్ధమైంది . ఈనెల 19 న జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈరోజు ఉగాది కావడంతో ఆ సందర్బంగా జెర్సీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ , ట్రైలర్ ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు ఆ చిత్ర బృందం .

- Advertisement -

మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ జెర్సీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక నాని హీరోగా నటిస్తుండగా నాని సరసన కన్నడ భామ శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది . నాని క్రికెటర్ గా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి . వేసవిలో తప్పకుండా ప్రేక్షకుల దాహార్తిని తీర్చేలా ఉందని భావిస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇక సరైన హిట్స్ లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది . ఆ వెలితిని జెర్సీ తీరుస్తుందేమో చూడాలి . ఈనెల 19 న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈనెల రెండో వారంలో జెర్సీ ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All