
నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈమధ్యనే రిలీజైన టీజర్ తో అంచనాలు పెంచిన శ్యామ్ సింగ రాయ్ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా బిజినెస్ భారీగా చేస్తుందని తెలుస్తుండగా హిందీ రైట్స్ 10 కోట్లకు కొనేసినట్టు టాక్. నాని కెరియర్ లో హిందీ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడవడం ఇదే మొదటిసారి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో భారీ అంచనాలతో శ్యామ్ సింగ రాయ్ సినిమా వస్తుంది.
ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. సినిమా తప్పకుండా ఆడియెన్స్ అంచనాలను అందుకుంటుందని గట్టిగా చెబుతున్నాడు నాని. వి, టక్ జగదీష్ ఫ్లాప్ తర్వాత నాని ఈ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు.