Homeటాప్ స్టోరీస్భారీ యాక్సిడెంట్ నుండి బయటపడిన నాని

భారీ యాక్సిడెంట్ నుండి బయటపడిన నాని

nani revealed his old car accident storyహీరో నాని భారీ యాక్సిడెంట్ నుండి తృటిలో తప్పించుకున్నాడు ,కానీ గాయాలపాలై స్పృహ కోల్పోయాడు . అయితే సంచలనం సృష్టించే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు దాదాపు పదేళ్ల కిందటి సంఘటన అన్నమాట ! అష్టాచెమ్మా సినిమా తర్వాత హీరోగా బిజీ అయిపోయాడు నాని ఆ సమయంలో తీరిక లేకుండా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడట !అయితే స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుండి అంతర్వేది కు రాత్రి పూట కారులో బయలుదేరాడు నాని . డ్రైవ్ చేస్తున్న నాని కి రాత్రి చిమ్మ చీకట్లు కావడంతో అడ్డంగా ఉన్న లారీ కనిపించలేదట అంతే ! టక్కున గుద్దేసాడు .

రోడ్డు మీద భారీ యాక్సిడెంట్ కావడంతో కారు అద్దాలు పగిలి నాని కి గుచ్చుకున్నాయి ,బలవంతం మీద కారు డోరు తీసుకొని కిందకు దిగాడట ! ఆ పక్కనే ఉన్న తన స్నేహితుడు ప్రకాష్ స్పృహలో లేకపోవడంతో మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ భయపడ్డారట ….. అయితే గట్టిగా అరవడంతో అతడు స్పృహలోకి రావడం నాని స్పృహ తప్పడం జరిగిందట . ఇది జరిగి చాలా కాలం అయ్యింది ఈరోజు స్నేహితుల దినోత్సవం కాబట్టి మీతో పంచుకుంటున్నాను అంటూ నాని చెప్పడంతో అందరూ ఉద్వేగానికి లోనయ్యారు .

- Advertisement -

English Title: nani revealed his old car accident story

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All