Homeఎక్స్ క్లూసివ్జెర్సీ లో నాని ఫస్ట్ లుక్ సూపర్

జెర్సీ లో నాని ఫస్ట్ లుక్ సూపర్

Nani jersey first look out
Nani

నాని హీరోగా నటిస్తున్న చిత్రం ” జెర్సీ ”. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది . నాని కి కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ చిత్రాలు దెబ్బ కొట్టాయి దాంతో జెర్సీ పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు . ఇక రేపు కొత్త సంవత్సరం కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జెర్సీ లో నాని లుక్ ని రిలీజ్ చేసారు . ఆ లుక్ కు స్పందన అనూహ్యంగా వస్తోంది .

నాని లుక్ బాగుండటంతో స్పందన బాగుంది , ఫస్ట్ లుక్ లాగే సినిమా కూడా అలరిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు ఆ చిత్ర బృందం . క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటిస్తోంది . అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలన్నీ హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి టాలీవుడ్ లో దాంతో ఈ జెర్సీ కూడా ఆ కోవలోకే వస్తుందని ఆశిస్తున్నారు .

- Advertisement -

English Title: Nani jersey first look out

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All