Homeటాప్ స్టోరీస్గాయపడిన నాని

గాయపడిన నాని

Nani injured on Jersey setsహీరో నాని ముక్కు కు గాయం అయ్యింది . అయితే అది స్వల్ప గాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . హీరో నాని తాజాగా జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో క్రికెటర్ గ నటిస్తున్నాడు నాని . అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ముక్కు కి గాయం కావడంతో అందరూ కంగారు పడ్డారు అయితే అది చిన్న గాయం మాత్రమే కావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడట నాని .

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రంలో యు టర్న్ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది . సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు . వరుసగా రెండు పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నాని జెర్సీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మరి .

- Advertisement -

 

English Title: Nani  injured on Jersey sets

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All