Homeటాప్ స్టోరీస్హిందీ జెర్సీ ఫై నాని కామెంట్స్

హిందీ జెర్సీ ఫై నాని కామెంట్స్

nani comments to hindi jersey
nani comments to hindi jersey

నాని – గౌతమ్ తిన్ననూరి కలయికలో ఏప్రిల్ 19, 2019 న వచ్చిన మూవీ జెర్సీ. నాని సినిమాల్లో జెర్సీ మూవీ ఓ మైలురాయి చిత్రంగా చెప్పవచ్చు . క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా.. ఒక వైపున ఆట .. మరో వైపున ఆశయం .. ఈ రెండింటితో ముడిపడిన జీవితాన్ని గురించి చెబుతుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా తెలుగునాట మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా హిందీ లో తెరకెక్కి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

షాహిద్ కపూర్ – మృణాల్ ఠాకూర్ జంటగా గౌతమ్ హిందీ రీమేక్ చేసాడు. ఈ సినిమాను దిల్ రాజు .. సూర్యదేవర నాగవంశీ .. అల్లు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా ఫై నాని స్పందించారు. హిందీ ‘జెర్సీ’ చూశాను .. చాలా బాగుంది. షాహిద్ కపూర్ తన పాత్రకి న్యాయం చేశారు. మృణాల్ ఠాకూర్ .. పంకజ్ కపూర్ .. రోనిత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది.

- Advertisement -

గౌతమ్ తిన్ననూరి హిందీలోను హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ ” అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశాడు. తెలుగు వెర్షన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన అనిరుధ్ హిందీ వెర్షన్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All