Homeటాప్ స్టోరీస్`విశ్వామిత్ర’ టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

`విశ్వామిత్ర’ టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

Nanditha Raj releases Teaser for 'Viswamitra'రాజకిరణ్‌ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యం’ రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ కీలక పాత్రధారులు. రాజకిరణ్‌ దర్శకుడు. మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్‌ నిర్మాతలు. ఫణి తిరుమలశెట్టి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను హీరోయిన్ నందిత గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్ లో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రెస్ మీట్‌లో… క‌థానాయిక నందిత మాట్లాడుతూ ‘‘చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. కేవలం గ్యాప్‌ను ఫిలప్‌ చేసుకోవడం కోసం చేయలేదు. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. వైవిధ్యంగా అనిపించింది. స్ర్కిప్ట్‌ నచ్చి చేశాను. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తీశారు. అఽశుతోష్‌గారితో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేను. అందమైన థ్రిల్లర్‌ ఇది. న్యజిలాండ్‌లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో సాగుతుంది’’ అని అన్నారు.

- Advertisement -

దర్శకుడు రాజ్‌కిర‌ణ్‌ మాట్లాడుతూ ‘‘నేను ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ కథను చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాను. కానీ పలువురు వినడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఆ తరుణంలో సంకల్పబలంతో నేను రాజకిరణ్‌ సినిమా అనే సంస్థను మొదలుపెట్టాను. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే సమయానికి అందరూ సెట్‌ అయ్యారు. డిసెంబర్‌ మొదటివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. న్యూజిలాండ్‌లో జరిగిన యథార్థ గాథ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని అంశాలను కూడా మిళితం చేశాం. థ్రిల్లర్‌ తరహా చిత్రం. హారర్‌ కాదుగానీ, కొంచెం హారర్‌ టచ్‌ మాత్రం ఉంటుంది. కథ వినగానే నందిత యాక్సెప్ట్‌ చేశారు. అశుతోష్‌ రాణా ఇందులో మెయిన్‌ విలన్‌గా నటించారు’’ అని అన్నారు.

సత్యం రాజేష్‌ మాట్లాడుతూ ‘‘రాజకిరణ్‌గారు రెండేళ్ల క్రితం ఈ కథ చెప్పారు. పాయింట్‌ హిట్‌ పాయింట్‌ అని అన్నాను. ఒకరోజు ఆయన ఫోన్‌ చేసి మీరే మెయిన్‌ లీడ్‌ అని అన్నారు. ఆ తర్వాత ఈ స్ర్కిప్ట్‌ని చాలా మంది దగ్గరకు తీసుకెళ్లాం. రాజేష్‌ మెయిన్‌ లీడ్‌ ఏంటి? అని అన్నవారు కూడా ఉన్నారు. అయితే మా నిర్మాతలు రజనీకాంతగారు, మాధవిగారు నమ్మి సినిమా చేశారు. ఫణిగారు కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. హిట్‌ సినిమా తీయడమే ధ్యేయంగా ఉన్నారు మా దర్శకుడు. బడ్జెట్‌ కూడా బాగా పెరిగింది. అయినా వెనుకాడలేదు. విద్యుల్లేఖ రామన్‌ రోల్‌ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ప్రసన్న, అశుతోష్‌, నందిత పాత్రలు చాలా బావుంటాయి’’ అని అన్నారు.

విద్యుల్లేఖ రామన్‌ మాట్లాడుతూ ‘‘శ్రీనివాస కల్యాణం సమయంలో రాజేష్‌ నాకు ఈ కథ గురించి చెప్పి, డేట్లు కావాలన్నారు. వెంటనే అంగీకరించాను. ‘గీతాంజలి’ సమయం నుంచి నేను రాజకిరణ్‌గారికి ఫ్యాన్‌. ఇందులో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాను. నందిత పక్కన కనిపిస్తాను. రాజేష్‌తోనూ మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. ప్రతి ఒక్కరి పాత్రా బావుంటుంది. రియల్‌లైఫ్‌లో జరిగిన ఘటన అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయాను. డిసెంబర్‌లో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు.

నటీనటులు : విద్యుల్లేఖ రామన్‌, చమ్మక్‌ చంద్ర, గెటప్‌ శ్రీను, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, రాకెట్‌ రాఘవ, సి.వి.యల్‌.నరసింహారావు, ఇందు ఆనంద్‌ కీలక పాత్రధారులు.

సాంకేతిక నిపుణులు : ఈ చిత్రానికి మాటలు: వంశీకృష్ణ ఆకెళ్ల, కెమెరా: అనిల్‌ బండారి, ఎడిటర్‌: ఉపేంద్ర, యాక్షన్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్‌, శేఖర్‌ మాస్టర్‌, ఆర్ట్‌: చిన్నా, నిర్మాతలు: మాధవి అద్దంకి, రజనీకాంత.ఎస్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: రాజకిరణ్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All