Homeటాప్ స్టోరీస్ఆ సినిమా విడుదల వాయిదాపడింది

ఆ సినిమా విడుదల వాయిదాపడింది

nandamuri kalyan ram naa nuvve release postponedఈనెల 25న నందమూరి కళ్యాణ్ రామ్తమన్నా జంటగా నటించిన ” నా నువ్వే ” విడుదల కావాల్సి ఉండే కానీ అనూహ్యంగా ఆ సినిమాని వాయిదా వేశారు దాంతో ఈనెల 25న అమ్మమ్మ గారిల్లు , రవితేజ నటించిన నేల టిక్కెట్టు విడుదలై పోటీ పడనున్నాయి . జయేంద్ర దర్శకత్వంలో ముప్పవరపు కిరణ్ – విజయ్ కుమార్ వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” నా నువ్వే ” . నందమూరి కళ్యాణ్ రామ్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా ఆ భామని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట .

ఈనెల 25న భారీ ఎత్తున విడుదల చేయాలనీ భావించారు అన్నీ సిద్ధం అని అనుకుంటుండగా సడెన్ గా జూన్ 1 కి వాయిదా వేశారు నా నువ్వే చిత్రాన్ని . కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కొత్త ఇమేజ్ ని ఇస్తుందని భావిస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు . కళ్యాణ్ రామ్ కూడా యాక్షన్ చిత్రాలను చేసి చేసి ఈ జోనర్ లో ఓ సినిమా చేసి చూద్దామని కొత్తగా ట్రై చేసాడట ! అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . సినిమా విడుదలైన తర్వాత టాక్ బాగుంటే కళ్యాణ్ రామ్ కు మరింత మంచి ఇమేజ్ వస్తుంది లేకపోతే యధా మామూలే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All