Homeటాప్ స్టోరీస్మోడీ , కేసీఆర్ , జగన్ లపై బాలయ్య బూతుల వర్షం

మోడీ , కేసీఆర్ , జగన్ లపై బాలయ్య బూతుల వర్షం

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాని మోడీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఏపీ ప్రతిపక్ష నేత జగన్ లపై బూతుల వర్షం కురిపించాడు . వాళ్ళు ముగ్గురు నన్ను ఏమి పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేసాడు . హిందూపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బాలయ్య ప్రచారాన్ని హిందూపురంలో ఉధృతం చేసిన విషయం తెలిసిందే .

- Advertisement -

ఆ ప్రచారంలో భాగంగా బాలయ్య నోరు పారేసుకుంటున్నాడు . నేను గతంలో ధర్మ పోరాట దీక్ష సమయంలో మోడీ పై విరుచుకుపడ్డాను , ఆ మాటలకు సిగ్గూ శరం ఉన్నవాడు ఎవడైనా సముద్రంలో దూకి చస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు . అలాగే మోడీ , కేసీఆర్ , జగన్ లు కలిసి వచ్చినా నన్ను పీకలేరు అంటూ పరుష పదజాలం వాడాడు .

బాలయ్య నుండి బూతులు వస్తుంటే ప్రజలు నివ్వెరపోయారట ! అయితే బాలయ్య అభిమానులు , తెలుగుదేశం శ్రేణులు మాత్రం బాలయ్య ప్రసంగానికి ఈలలు వేస్తూ మరింతగా రెచ్చిపోయారు . మొత్తానికి ఎన్నికల వేళ బాలయ్య డైలాగ్స్ తో ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకుంటున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All