Homeటాప్ స్టోరీస్మామయ్య గారు అంటూ సూపర్ స్టార్ కృష్ణ ఫై ప్రేమను వ్యక్తం చేసిన నమ్రత

మామయ్య గారు అంటూ సూపర్ స్టార్ కృష్ణ ఫై ప్రేమను వ్యక్తం చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ తో గడిపేందుకు కొంత సమయం తీసుకుంటారు. కాస్త షూటింగ్ షెడ్యూల్ లలో గ్యాప్ వస్తే వెంటనే ఫ్యామిలీ తో విదేశాలకు చెక్కేస్తుంటాడు. చాలామంది సినీ ప్రముఖులు మహేష్ ను చూసి ఫాలో అవుతుంటారు. ఇలా మహేష్ ఫ్యామిలీ తో గడపడానికి కారణం ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారే. కుటుంబం అంటే ఏంటి..వారితో ఎలా ఉండాలి..ఎలా టైం స్పెండ్ చేయాలి అనేది చిన్నప్పటి నుండి మహేష్ కు చెపుతుండేవారట. అందుకే తండ్రి చెప్పినట్లే ఫ్యామిలీ తో గడిపేందుకు ఇష్టపడుతుంటారు.

- Advertisement -

ప్రస్తుతం కృష్ణ, మహేష్ బాబు వేర్వేరు ఇంట్లో ఉన్నప్పటికీ ప్రతీ వారంలో ఒక రోజు మాత్రం తండ్రి వద్దే గడుపుతుంటారట. ఒకవేళ మహేష్ సినిమా షూటింగ్ లలో బిజీ గా ఉన్నప్పటికీ పిల్లలను తీసుకొని నమ్రత వెళ్ళుతుందట. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను నమ్రత షేర్ చేసింది. మండే లంచ్.. ఎప్పుడూ మిస్ అవ్వం.. ఎన్నో కథలు చెబుతుంటారు.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు అని కృష్ణ గురించి నమ్రత చెప్పుకొచ్చింది. ఇక ఫోటో చూసి అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చేస్తున్నాడు. మే 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All