Homeఎక్స్ క్లూసివ్నాగార్జున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా

నాగార్జున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా

అక్కినేని నాగార్జున హీరోగా ఎంత పేరు సంపాదించాడో అంతకంటే ఎక్కువే మంచి బిజినెస్ మెన్ గా పేరుగాంచాడు . అంతేకాదు అక్కినేని కుటుంబం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా నిలిచింది ,అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రం అక్కినేని నాగేశ్వర్ రావు తెలుగుదేశం వైపు మొగ్గు చూపాడు . ఆ తర్వాత నాగార్జున వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు నెరిపాడు అలాగే జగన్ తో కూడా . కట్ చేస్తే రాష్ట్రము విడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాడు నాగార్జున కానీ అతడి ఆశలన్నీ తల్లకిందులు అయ్యాయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది .

కానీ 2019 లో మాత్రం జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని నమ్ముతున్నాడు నాగార్జున , దాంతో అతడ్ని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పార్లమెంట్ కు పోటీ చేయిస్తే ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రభావం ఉంటుంది కాబట్టి నాగార్జున ని పోటీ చేయించాలని భావిస్తున్నాడట నాగార్జున . అయితే నాగార్జున కు రాజకీయాలు బాగానే వంటబట్టాయి కానీ ప్రత్యక్ష రాజకీయాలు ఇష్టం లేదు నాగార్జున కు . అందుకే పోటీ చేయక పోవచ్చని తన బదులుగా అమల ని రంగంలో దింపవచ్చని భావిస్తున్నారు . మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మాత్రం నాగార్జున సపోర్ట్ జగన్ కే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All