Homeటాప్ స్టోరీస్నాగ్ ఆఫీసర్ కథ నాదేనంటున్న జయకుమార్

నాగ్ ఆఫీసర్ కథ నాదేనంటున్న జయకుమార్

nagarjuna officer script leakedకింగ్ నాగార్జున హీరోగా నటించిన ” ఆఫీసర్ ” చిత్ర కథ నాదేనంటూ రాంగోపాల్ వర్మ ని కార్నర్ చేస్తున్నాడు యువ కథా రచయిత జయకుమార్ . 2015 లోనే ఆఫీసర్ స్క్రిప్ట్ రాసానని , అది అప్పుడే దర్శకులు రాంగోపాల్ వర్మ కు ఇచ్చానని కానీ నా అనుమతి లేకుండా ఇప్పుడు సినిమా చేసారని అందుకు లీగల్ గా చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యాను అంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు జయకుమార్ . ఇంతకుముందు కూడా మియా మాల్కోవా కీలక పాత్ర పోషించిన అడల్ట్ చిత్ర కథ నాదే రాంగోపాల్ వర్మ కు నోటీసులు ఇచ్చాడు ఈ జయకుమార్ .

వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసాడు ఈ జయకుమార్ , అయితే అతడి దగ్గర పనిచేస్తున్న సమయంలోనే ఇప్పుడు నాగార్జున నటించిన ఆఫీసర్ స్క్రిప్ట్ రాసి ఇచ్చానని అయితే దాన్ని ఇప్పుడు నా అనుమతి లేకుండానే సినిమా చేసాడని , రేపు సైబర్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయమని కోరతామని అంటున్నాడు . ఆల్రెడీ నేను రాసిన స్క్రిప్ట్ విడుదల చేశానని , ఆఫీసర్ చిత్రం విడుదల కాకుండా చర్యలు తీసుకుంటానని అంటున్నాడు జయకుమార్ . అసలు ఆఫీసర్ చిత్రాన్ని ఈనెల 25 న విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరకపోవడంతో జూన్ 1 కు పోస్ట్ పోన్ చేసారు వర్మ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All