Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్ఇంతకీ బిగ్ బాస్ లో నాగార్జున హిట్టా.. ఫట్టా!

ఇంతకీ బిగ్ బాస్ లో నాగార్జున హిట్టా.. ఫట్టా!

nagarjuna bigg boss telugu 3
nagarjuna bigg boss telugu 3

బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. కొంతమంది ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక ఇంట్లో పెడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో తయారైందే బిగ్ బాస్. ఈ షో చాలా భాషల్లో ఏళ్లకేళ్లుగా సాగుతోంది. అంతెందుకు హిందీలో అయితే ఈ షో 13 సీజన్లుగా తన సత్తా చాటుతోంది. ఇప్పటికీ ఈ షోకు అదిరిపోయే టీఆర్పీలు వస్తుంటాయి. హిందీలో బిగ్ బాస్ అంతలా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం హోస్ట్ సల్మాన్ ఖాన్.

- Advertisement -

వరసగా అన్ని సీజన్లకు హోస్ట్ గా విజయవంతంగా చేయడమంటే మాటలు కాదు. అలాంటిది సల్మాన్ ఖాన్ విజయవంతంగా ఈ పనిని పూర్తి చేస్తున్నాడు. షో మీద కంప్లీట్ గ్రిప్ తో నడిపిస్తున్నాడు. మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూడకపోయినా ఏం జరిగిందనేది క్షుణ్ణంగా తెలుసుకుని తప్పు చేసిన కంటెస్టెంట్స్ ను అసలు వదలకుండా మందలించి వదులుతాడు. ఒక్కోసారి సల్మాన్ ధాటికి కంటెస్టెంట్స్ బెదిరిపోయే పరిస్థితి కూడా వచ్చింది. బిగ్ బాస్ వరకూ షో కు అదనపు గ్లామర్ తీసుకొచ్చేది హోస్ట్ మాత్రమే. ప్రతి వీకెండ్ హోస్ట్, కంటెస్టెంట్స్ ను ప్రశ్నించాలని కోరుకుంటారు ఆడియన్స్. అది సరిగ్గా జరిగినప్పుడు ఆడియన్స్ కూడా తృప్తి చెందుతారు.

హిందీ సంగతి పక్కనపెట్టేస్తే మన తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ కు సరైన వ్యక్తులు దొరకట్లేదేమో అనిపిస్తుంది. హిందీలో సల్మాన్ ఖాన్ మొదటినుండి షో ను నడిపిస్తున్నాడు. తమిళంలో కమల్ హాసన్ ఆ పనిని పూర్తిచేస్తున్నాడు. కానీ తెలుగులోనే ప్రతి ఏడాది హోస్ట్ మారిపోతున్నాడు. తొలి సీజన్ ను ఎన్టీఆర్ విజయవంతంగా నడిపించాడు. తొలి సీజన్ హోస్టింగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అయితే ఎందుకో ఎన్టీఆర్ సెకండ్ సీజన్ పై ఆసక్తి చూపించలేదు. అందుకు సెకండ్ సీజన్ కు హోస్ట్ గా నాని వచ్చాడు. నాని హోస్టింగ్ బాగానే ఉన్నా షో ను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాడనేది వాస్తవం. కౌశల్ ను ఏమైనా అంటే కౌశల్ ఫ్యాన్స్, అనకపోతే యాంటీ ఫ్యాన్స్ మధ్య నాని నలిగిపోయాడు. ఏదేమైనా మొత్తానికి బిగ్ బాస్ 2 కు కూడా రేటింగ్స్ బాగానే వచ్చాయి.

ఈసారి మూడో సీజన్ విషయానికొస్తే నాగార్జునను తీసుకొచ్చారు. నాగార్జున నుండి చాలా ఆశించారు ప్రేక్షకులు. అయితే నాగ్ ఎందుకో షో ఫార్మాట్ ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనిపిస్తుంది. తప్పు చేసిన పాయింట్ టు పాయింట్ నిలదీయడం అనేది లేనప్పుడు ఇక వాళ్లలో భయమేముంటుంది. అసలు నాగార్జున హోస్టింగ్ చూస్తుంటే క్లియర్ గా తను అసలు షో చూడట్లేదన్న విషయం అర్ధమైపోతుంది. కేవలం బిగ్ బాస్ టీమ్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ హోస్టింగ్ చేస్తున్నాడు. ఒక్కోసారి అయితే మరీ క్లూలెస్ గా అనిపిస్తూ కంటెస్టెంట్స్ నే ఏది తప్పో ఏది ఒప్పో, అసలు ఏం జరిగిందో అడుగుతున్నాడు. దీని వల్ల షో చూసేవారికి ఆసక్తి సన్నగిల్లడం ఖాయం. ఈ రకంగా చూస్తే నాగార్జున హోస్ట్ గా ఫెయిల్ అయినట్లే. మరి నెక్స్ట్ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా చేస్తాడా అన్నది సందేహమే.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts