Homeటాప్ స్టోరీస్ముమ్మాటికీ నాగార్జున చేసిన పెద్ద తప్పు

ముమ్మాటికీ నాగార్జున చేసిన పెద్ద తప్పు

nagarjuna blunder mistake acting in rgv officer movieతెలిసి తెలిసి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించడం హీరో నాగార్జున తప్పని విరుచుకు పడుతున్నారు నాగార్జున అభిమానులు . తాజాగా నాగార్జున వర్మ దర్శకత్వంలో ” ఆఫీసర్ ” అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . ఆ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది . గతకొంత కాలంగా వర్మ దర్శకత్వంలో వస్తున్న కళాఖండాలు ఎలా ఉంటున్నాయి ప్రేక్షకులకు తెలుసు కాబట్టి ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి .

అయితే ఎక్కడో చిన్న ఆశ …… ఎందుకంటే నాగార్జున నమ్మకంగా ఉన్నాడు పైగా ఒప్పుకొని మరీ సినిమా చేసాడు కాబట్టి పొరపాటున హిట్ కాకపోతుందా అని ఆశ . కానీ ఆ ఆశ అడియాసలయ్యాయి సినిమా విడుదలయ్యాక . ఏమాత్రం నిర్మాణ విలువలు లేని చిత్రంలో , నాసిరకమైన చిత్రంలో నాగార్జున నటించి తన పరువు తీసుకున్నాడు అని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు . నిజంగానే అభిమానుల ఆందోళన లో వాస్తవం ఉంది , ఎందుకంటే ఆఫీసర్ చిత్రంలో నాగార్జున నటన తప్ప , బేబీ కావ్య నటన తప్ప మరో అంశం ఏమి లేదు ….. అంత దారుణంగా తీసాడు వర్మ ఆఫీసర్ చిత్రాన్ని . వర్మ చేస్తున్న చిత్రాలన్నీ చెత్త సినిమాలు అవుతున్న ఈ సమయంలో నాగార్జున రిస్క్ చేసి మరీ సినిమా ఒప్పుకోవడం నాగార్జున తప్పే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All