Homeటాప్ స్టోరీస్నాగశ్రీను..నాగబాబు ను ఎంత స్టైలిష్ గా మార్చాడో..

నాగశ్రీను..నాగబాబు ను ఎంత స్టైలిష్ గా మార్చాడో..

nagababu shers makerover nagasrinu
nagababu shers makerover nagasrinu

హెయిర్ డ్రెస్సెర్ ఉప్పలపు నాగ శ్రీను – మంచు ఫ్యామిలీ వ్యవహారం ప్రతి రోజు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఆఫీస్ లో విలువైన వస్తువులు దొగించాడని మంచు ఫ్యామిలీ ఆరోపిస్తే..మంచు ఫ్యామిలీ మా కులాన్ని దూషించారని నాగ శ్రీను చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నాగ శ్రీను కుల సంఘాలు మంచు ఫ్యామిలీ ఫై విరుచుకుపడడం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నాగ శ్రీను కు నాగ బాబు ఆర్ధిక సాయం చేయడం మరో వివాదానికి దారితీసింది. మంచు ఫ్యామిలీ మీద ఉన్న కోపం తోనే నాగ బాబు ఆర్ధిక సాయం చేసారని కొంతమంది ఆరోపించారు. ఇదిలా ఉంటె తాజాగా నాగ శ్రీను పనితనం చూడండి అంటూ నాగబాబు ను స్టైలిష్ గా మార్చిన ఫొటోస్ షేర్ చేసి..నాగ శ్రీను పనితనం గురించి అంత మాట్లాడుకునేలా చేసాడు.

నాగ శ్రీను మేకోవర్ గురించి చెబుతూ.. తనని ఎంత అందంగా మలిచాడో చూపించాడు నాగబాబు. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఇందులో నాగబాబు ఎంతో స్టైలీష్‌గా కనిపించాడు. నీ ప్రతిభే ఎప్పుడూ నీ విజయానికి మార్గం సుగమం చేస్తుంది. ఆ రోజు నీకు ఇచ్చిన చెక్ కూడా అందుకే..నన్ను ఇలా అందంగా మార్చినందుకే ఇచ్చాను.. ఇలానే ఎప్పుడూ కష్టపడుతూ ఉండు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All