Homeఎక్స్ క్లూసివ్తప్పు బాలయ్య మీద నెట్టేసిన నాగబాబు

తప్పు బాలయ్య మీద నెట్టేసిన నాగబాబు

Nagababu clarifies why he trolls balakrishna
Nagababu and Balakrishna

మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ సెటైర్ వేసాడు కానీ ఇప్పుడు వాస్తవ దృక్పధంతో మాట్లాడాడు , విమర్శలు చేసాడు కానీ ఆ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు అంతేకాదు ఈ తప్పులకు కారకుడు బాలయ్య అంటూ నేరుగా బాలయ్య మీదే నెట్టేశాడు నాగబాబు . బాలయ్య పై విమర్శలు చేయడంతో నాగబాబు పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అంతేకాదు ఇన్నాళ్లు సహించిన బాలయ్య అభిమానులు నాగబాబు ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు దానికి తోడు ఇటీవల కాలంలో బాలయ్య నేరుగా మెగా బ్రదర్స్ ని విమర్శించలేదు అది కూడా బాగా పనిచేసి నట్లుంది అందుకే బాలయ్య పై విమర్శలు చేయద్దు అని మెగా ఫ్యాన్స్ నేరుగా నాగబాబు ని అన్నారట .

దాంతో కాబోలు తాజాగా మరో వీడియో ని రూపొందించి దాన్ని వదిలాడు నాగబాబు . అందులో వివరణ ఇచ్చాడు . నాగబాబు ఇచ్చిన సారాంశం ఏంటంటే …… 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో సహకరించాడు కాగా అలాంటి నా తమ్ముడ్ని పవన్ కళ్యాణ్ ఎవరో తెలీదు అని అన్నారు అక్కడ చాలా హర్ట్ అయ్యాను , అలాగే గడిచిన నాలుగైదేళ్ల లో మా కుటుంబం పై రకరకాల కామెంట్స్ చేసారు అందుకే ఇలా రియాక్ట్ కావాల్సి వచ్చింది . నేను అంటే మీకు బాధ కలిగినప్పుడు మీరు అన్నప్పుడు మాకు బాధ ఉండదా ? అంటూ తప్పంతా బాలయ్య మీద నెట్టాడు నాగబాబు .

- Advertisement -

English Title: Nagababu clarifies why he trolls balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All