Homeటాప్ స్టోరీస్చైతు, సమంత.. ప్రేమ.. పెళ్లి.. మూన్నాళ్ల ముచ్చట..!

చైతు, సమంత.. ప్రేమ.. పెళ్లి.. మూన్నాళ్ల ముచ్చట..!

టాలీవుడ్ లవ్ బ్రడ్స్.. క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంతల డైవర్స్ న్యూస్ అందరికి షాకింగ్ అని చెప్పొచ్చు. కలిసి నటించి.. అభిప్రాయాలు కలిసి.. ప్రేమని పంచుకుని.. జీవితాన్ని కూడా పంచుకున్న నాగ చైతన్య, సమంతలు ఇంత త్వరగా ఎవరి దారి వారు చూసుకుంటారని ఊహించలేదు.

పరిచయం.. ప్రేమ.. మొదలైంది అక్కడే..

- Advertisement -

నాగ చైతన్య హీరోగా గౌతం మీనన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఏమాయ చేసావె. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు తొలి పరిచయమైంది సమంత. సినిమాలో ఆమె నటనకు ఆడియెన్స్ మాత్రమే కాదు చైతు కూడా ఫ్లాట్ అయ్యాడు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని రూమర్స్ వచ్చాయి.

సీక్రెట్ లవ్..

చైతు, సమంత కలిసి తిరగడం.. అడపాదడపా మీడియా కంట పడటం తెలిసిందే. వుయార్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూనే మధ్యలో చాలా వ్యవహారం నడిపించారు. ఇక ఈ క్రమంలో వీరిద్దరు సీక్రెట్ లవ్ మెయింటైన్ చేశారు. ఇద్దరు ఒకరిని ఒకరు సీక్రెట్ గా కలవడం.. నైట్ పార్టీస్ లాంటివి జరిగాయి.

కలిసి నటించిన సినిమాలు..

ఏమాయ చేసావె సినిమాతో మొదటిసారి కలిసి నటించిన నాగ చైతన్య, సమంత.. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో కలిసి నటించారు. అంటే టోటల్ గా చై, సాం కలిసి నాలుగు సినిమాల్లో నటించారు.

టాటూ చెప్పిన ప్రేమ కథ..

అప్పటికే చైతన్య, సమంతల మధ్య ఏదో జరుగుతుంది అని మీడియా కోడై కూస్తుంటే.. వీరిద్దరికి సేం టాటూ ఉండటం వల్ల ఇద్దరి మధ్య లవ్ కన్ఫర్మ్ చేస్తూ మీడియా వార్తలు రాసింది. ఇక ఆ తర్వాత ఇద్దరు దాన్ని కన్ఫర్మ్ చేసి సర్ ప్రైజ్ చేశారు.

మ్యారేజ్ డీటైల్స్..

నాగ చైతన్య, సమంత 2017 అక్టోబర్ 6,7 తేదీల్లో పెళ్లి చేసుకున్నారు. గోవాలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 6న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగగా.. 7న క్రిస్టియన్ ట్రడిషనల్ లో మ్యారేజ్ జరిగింది.

విడాకులకు దారి తీసిన కారణాలు..

ఆఫ్టర్ మ్యారేజ్ సమంత కూడా సినిమాలతో బిజీగా ఉంది. అయితే కమర్షియల్ సినిమాలు చేయకపోయినా అడపాదడపా ఆమె గ్లామర్ షోకి ఫ్యామిలీ అభ్యంతరకరం చేస్తుందని టాక్. ఇదే విషయంపై చైతు, సమంత చాలాసార్లు మాట్లాడుకున్నారని తెలుస్తుంది. ఇక సూపర్ డీలక్స్ సినిమా.. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో సమంత చేసిన బోల్డ్ సీన్స్ కు అక్కినేని ఫ్యామిలీ హర్ట్ అయినట్టు టాక్. ఆ కారణాల వల్ల సమంతని ఇక సినిమాలు ఆపేయాలని చైతు చెప్పాడట. అయితే పెళ్లికి ముందే కెరియర్ కు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదనే కమిట్మెంట్ తో పెళ్లి చేసుకున్న సమంత ఈ రిస్టిక్షన్స్ ను భరించలేకపోయిందని అంటున్నారు.

డైవర్స్ ఎనౌన్స్ మెంట్..

నాగ చైతన్య, సమంతల ప్రేమ విషయంలో మీడియా ఎలాగైతే కథనాలు రాసిందో.. వీరిద్దరు విడిపోతున్నారు అన్న విషయంపై కూడా కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫ్యామిలీతో చర్చల అనంతరం అక్టోబ 2న నాగ చైతన్య, సమంతలు తమ డైవర్స్ ను ఎనౌన్స్ చేశారు.

భార్య భర్తలుగా విడిపోయినా.. ఇద్దరం స్నేహితులుగా ఉంటామని అంటున్నారు నాగ చైతన్య, సమంత.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All