Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?

నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?

నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?
నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?

ఓటిటి మీడియం యొక్క పవర్ ను నెమ్మదిగా ప్రతీ ఆర్టిస్ట్ అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్లు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మెరిశారు. మరింత మంది నటించారు. ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేయనున్నారు. హారర్ జోనర్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ హారర్ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోంది.

- Advertisement -

సమంత ఇప్పటికే ఓటిటి ఎంట్రీకి సిద్ధమైంది. ఈమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో విడుదలకు సిద్ధమైంది. మరి నాగ చైతన్య తన ఓటిటి ఎంట్రీతో ఎలా మెప్పిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All