Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య కూడా బిజినెస్ లోకి దిగాడు

నాగ చైతన్య కూడా బిజినెస్ లోకి దిగాడు

Naga Chaitanya Enters Into New Business

చిత్రసీమలో రాణిస్తూ నాల్గు డబ్బులు సంపాదిస్తూనే..ఆ డబ్బు తో ఇతర బిజినెస్ లు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటారు. ఇప్పటికే టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు , అల్లు అర్జున్ , నాని , విజయ్ దేవరకొండ, రకుల్ మొదలగు నటి నటులు పలు బిజినెస్ లు మొదలుపెట్టి రాణిస్తున్నారు. తాజాగా అక్కినేని చైతన్య సైతం వీరి బాటలోనే ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. హైదరాబాద్‌లో ‘సోయు’ పేరుతో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్నీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ పెట్టి అభిమానులకు , సినీ ప్రముఖులకు తెలిపారు. ఈ పోస్ట్ చూడగానే వెంకటేశ్ కూతురు ఆశ్రిత ..‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా’ అంటూ రిప్లయ్ ఇచ్చి తన బావ కు అల్ ది బెస్ట్ తెలిపింది.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం చైతు వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమా పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం గా ఉంచాడు. అలాగే ఈయన డైరెక్షన్లోనే ఓ వెబ్ సిరీస్ సైతం స్టార్ట్ చేసాడు. వీటితో పాటు తాజాగా ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ యాప్ swiggy కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసాడు. మొత్తం మీద విడాకుల తర్వాత చైతు లో చాల మార్పులు కనిపిస్తున్నాయని అంత మాట్లాడుకుంటున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All