Homeగాసిప్స్నాగ చైతన్య స్పీడ్ మాములుగా లేదుగా

నాగ చైతన్య స్పీడ్ మాములుగా లేదుగా

Naga Chaitanya
Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య ఇండస్ట్రీకొచ్చి దశాబ్దం గడుస్తున్నా తనకంటూ స్థిరమైన మార్కెట్ ఏర్పరుచుకోవడంలో విఫలమవుతున్నాడు. ఒక హిట్ వచ్చిందంటే వరస ప్లాపులు అతన్ని చుట్టుముడుతుండడంతో కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

ఇటీవలే మజిలీ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి ట్రాక్ లో పడ్డ నాగ చైతన్య ఇకనైనా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు.

- Advertisement -

మావయ్య వెంకటేష్ తో కలిసి చేస్తున్న వెంకీ మామ చిత్రంలో నాగ చైతన్య తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో తెరకెక్కబోయే చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతే కాకుండా నాగార్జున ప్రధాన పాత్రలో సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కబోయే బంగార్రాజు చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు చైతన్య. ఈ చిత్రం నవంబర్ నుండి షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అనే చిత్రం పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దిల్ రాజు నిర్మాణంలో అదే నువ్వు అదే నేను చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఇలా వరస చిత్రాలతో నాగ చైతన్య యమ బిజీగా ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All