
అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ కు ఆత్త క్యారెక్టర్ లో కనిపించిన నదియా ..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ లో కీలక రోల్ చేస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ లో కీలక రోల్ చేస్తున్న నదియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పిందట. సాధారణంగా అయితే షూటింగ్ ను ముగించి తన పని పూర్తి అయ్యిందనే నదియా.. ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పిందట.
ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పని నదియా ఈ సినిమా కోసం మాత్రం డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ బలవంతం చేస్తే ఈ సినిమాలో మొదటి సారి డబ్బింగ్ చెప్పినట్లుగా సమాచారం. హీరోయిన్ గా అప్పట్లో నటించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తున్న నదియా మొదటి సారి చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు సఫలం అవుతుంది అనేది చూడాలి.