Homeటాప్ స్టోరీస్నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా రివ్యూ

Naa Peru Surya Reviewనటీనటులు : అల్లు అర్జున్ , అను ఇమ్మాన్యుయేల్ , అర్జున్
సంగీతం : విశాల్ శేఖర్
నిర్మాతలు : లగడపాటి శిరీషా శ్రీధర్
దర్శకతం : వక్కంతం వంశీ
రేటింగ్ : 3/ 5
విడుదల తేదీ : 4 మే 2018

 

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ” . నాగబాబులగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

మిలిటరీ సోల్జర్ అయిన సూర్య ( అల్లు అర్జున్ ) కు దేశమంటే ప్రాణం , దేశభక్తి అంటే గుండెలో ఉండాలి అని నమ్మే వ్యక్తి అయితే ఆర్మీ రూల్స్ కి వ్యతిరేకంగా ఓ ఉగ్రవాది ని కాల్చి చంపేస్తాడు .కల్నల్ సూర్య ని ఈ విషయం పై నిలదీయడంతో దేశానికి హాని చేసేవాడ్ని తిండి పెట్టి పోషించాల్సిన అవసరం లేదని , పక్కాగా సాక్ష్యాలు సేకరించి పాకిస్థాన్ కు ఇచ్చినప్పటికీ కసబ్ విషయంలో మోసం చేసిందని అలాంటి సమయంలో ఇంకా ఉగ్రవాదులను ఉపేక్షించాల్సిన అవసరం లేదని వాదిస్తాడు కల్నల్ తో . దాంతో మిలిటరీ నుండి సూర్య ని డిస్మిస్ చేస్తారు . ఎప్పటికైనా బోర్డర్ లో సేవలందించాలని తపన పడే సూర్య మిలిటరీ నుండి బయటకు వెళ్ళడానికి నిరాకరిస్తాడు దాంతో సైకాలజీ డీన్ అయిన రామకృష్ణం రాజు ( అర్జున్ ) చేత సంతకం తీసుకొని వస్తే మళ్ళీ మిలిటరీ లోకి తీసుకుంటామని చెబుతారు . దాంతో అతడి సంతకం కోసం వైజాగ్ వెళ్తాడు సూర్య . సైకాలజిస్ట్ అయిన రామకృష్ణం రాజు ని ఒప్పించి సంతకం చేయించుకున్నాడా ? ఆ క్రమంలో సూర్య ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

అల్లు అర్జున్
నేపథ్య సంగీతం
కథ

డ్రా బ్యాక్స్ :

పాటలు
ఎంటర్ టైన్ మెంట్

నటీనటుల ప్రతిభ :

సోల్జర్ పాత్రలో అల్లు అర్జున్ నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో , వన్ మ్యాన్ షోగా సాగింది . సూర్య పాత్రకు అల్లు అర్జున్ ప్రాణం పోశాడు . అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ ఈ పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యింది . అర్జున్ సైకాలజిస్ట్ పాత్ర లో రాణించాడు . రావు రమేష్ లతో పాటుగా మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . వెన్నెల కిషోర్ అందించిన కామెడీ ఈ సినిమాలో మంచి రిలీఫ్ .

సాంకేతిక వర్గం :

విశాల్ శేఖర్ అందించిన పాటల్లో 2 బాగున్నాయి కానీ మిగతా పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు అయితే నేపథ్య సంగీతం తో మాత్రం ఆకట్టుకున్నారు . విజువల్స్ బాగున్నాయి . నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరమీద కనిపించింది . ఇక దర్శకుడు వక్కంతం వంశీ విషయానికి వస్తే ……. సక్సెస్ ని పక్కన పెడితే దేశం కోసం అతడు ఎంచుకున్న పాయింట్ బాగుంది . అలాగే కొన్ని మామూలు సన్నివేశాలు ఉన్నప్పటికీ దేశభక్తి నరనరాన ఉన్న సూర్య క్యారెక్టర్ ని బాగా హ్యాండిల్ చేసాడు . అలాగే డైలాగ్స్ పరంగా కూడా బాగానే ఆకట్టుకున్నాడు వక్కంతం వంశీ .

ఓవరాల్ గా :

దేశం కోసం , దేశ హితం కోసం ఆశించే వాళ్లంతా తప్పకుండా చూడాల్సిన సినిమా .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All