
విశాల్ హీరోగా నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్ `తుప్పారివాలన్`. మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో `డిటెక్టివ్` పేరుతో విడుదలై రెండు భాషల్లోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తొలి భాగంలో నటించి నిర్మించిన విశాల్ ఈ చిత్రానికి సీక్వెల్‌గా `తుప్పారివాలన్ 2`ని చేయాలని ప్లాన్ చేశారు. మళ్లీ మిస్కినే ఈ సీక్వెల్ కి దర్శకుడు.
తొలి షెడ్యూల్ లండన్‌లో ప్లాన్ చేశారు. అక్కడే కీలక తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలనుకునుకున్నారు. ఈ షెడ్యూల్లో నటించే నటీనటుల కాస్ట్యూమ్స్ కోసం లండన్‌కు చెందిన కాస్ట్యూమర్‌నే తీసుకోవాని మిస్కిన్ పట్టుబట్టాడట. ఇక్కడి నుంచే ఈ సినిమా బడ్జెట్ పెరగడం మొదలైంది. ముందు ఈ మూవీని 40 కోట్లల్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ లేదు. అంత అవసరం లేదు తగ్గించాలని విశాల్ వాదన.. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందట.
చివరికి మిస్కిన్ ఈ సినిమా పూర్తి కాకుండానే తప్పుకున్నారట. దీంతో దర్శకుడి బాధ్యతల్ని కూడా విశాల్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే లండన్ షెడ్యూల్‌కే మిస్కిన్ 12 కోట్లు ఉఫ్ అని ఊదేశారట. మిస్కిన్ లండన్ షెడ్యూల్‌కే 12 కోట్లు ఖర్చు చేస్తే సినిమా పూర్తయ్యే సరికి 50 కోట్లు ఖర్చు చేసుండేవాడని, అది గ్రహించిన విశాల్ మధ్యలోనే అతన్ని తప్పించాడని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.