Homeటాప్ స్టోరీస్నా భ‌ర్త‌ నిజమైన మ‌గాడు : ఉపాసన

నా భ‌ర్త‌ నిజమైన మ‌గాడు : ఉపాసన

నా భ‌ర్త‌ నిజమైన మనిషి: ఉపాసన
నా భ‌ర్త‌ నిజమైన మనిషి: ఉపాసన

`అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ విరిసిరిన బి ది రియ‌ల్ మెన్ ఛాలెంజ్‌కి స్పందించిన రాజ‌మౌళి త‌న ఇంటి ప‌నిలో భార్య ర‌మ‌కు సహ‌క‌రించి బీ ద రియ‌ల్ మెన్ అనిపించుకున్నారు. ఆ త‌రువాత త‌న‌కు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో పాటు కీర‌వాణి, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసిరారు.

దీనికి బ‌దులిచ్చిన రామ్‌చ‌ర‌ణ్ ఇంటిప‌ని చేయ‌డ‌మే కాకుండా చెట్ల‌కి నీళ్లు పోయ‌డంతో పాటు ఫ్లోర్ క్లీన్ చేసి చివ‌రికి ఉపాస‌న‌కు కాఫీ ఇవ్వ‌డంతో టాస్క్ కంప్లీట్ చేశారు. దీనిపై ఉపాస‌న త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్ గురించి స్పందించింది. ‌తన భర్త రామ్ చరణ్ నిజమైన వ్యక్తి అని ఉపసనా కొణిదెల పేర్కొన్నారు. నిజమైన పురుషులు ఇంటి పనులను పంచుకుంటారు మరియు సమాన సంబంధాన్ని నమ్ముతారు` అని ఇన్‌స్టా వేదిక‌గా షేర్‌ చేశారు.

- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ వీడియోని షేర్ చేస్తూ మ‌రిన్ని విశేషాల్ని ఉపాస‌న తెలియ‌జేసింది.  క‌మ్యేనికేష‌న్ ఏదైనా సంబంధాన్ని బ‌ల‌ప‌రుస్తుంది. ఎవ‌రైతే  స‌మాన‌త‌ను పాటిస్టారో వారే నిజ‌మైన మ‌నిషి మ‌గాడు అని పేర్కొన్నారు. జీవిత భాగస్వామి యొక్క భావాల విష‌యంలో సున్నితంగా వ్య‌వ‌హ‌రించండి` అని ఉపాస‌న వెల్ల‌డించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All