Homeటాప్ స్టోరీస్యువ సంగీత దర్శకుడి ఆత్మహత్య

యువ సంగీత దర్శకుడి ఆత్మహత్య

music director anurag committed suicideయువ సంగీత దర్శకుడు అనురాగ్ వినీల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టిస్తోంది . అయితే ఈ సంగీత దర్శకుడు ఆత్మహత్య చేసుకొని వారం రోజులు కావడం గమనార్హం , ఈ వార్త ఆలస్యంగా బయటకి పొక్కింది . పలు షార్ట్ ఫిలిం లకు సంగీతం అందించిన అనురాగ్ వినీల్ కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు . ఈనెల 9న అనురాగ్ ఆత్మహత్య చేసుకోగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి .

వికారాబాద్ సమీపంలోని మార్ప్లేలి లో అనురాగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వినబడుతున్నాయి అలాగే నాగోల్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు మరో కథనం వినబడుతోంది . భిన్న కథనాలు వస్తుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు . ఇక అనురాగ్ కుటుంబీకులు ఈ విషయం పై పెద్దగా స్పందించడం లేదు . పోలీసుల దర్యాప్తు లోనే అసలు విషయాలు తేలనున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All