Homeటాప్ స్టోరీస్ఆ సినిమా ఆగిపోయిందా

ఆ సినిమా ఆగిపోయిందా

Multi starrer movie Venky mama shelvedసీనియర్ హీరో వెంకటేష్ , నాగచైతన్య ల కాంబినేషన్ లో ” వెంకీ మామ ” అనే చిత్రాన్ని ప్రకటించారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ మామ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది . పవర్ , జై లవకుశ , సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకీ మామ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు . కథ ఓకే అయ్యింది అయితే ఫైనల్ స్క్రిప్ట్ చూసేసరికి మాత్రం నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కు అంతగా నచ్చలేదట దాంతో ఆ సినిమాని పక్కన పెట్టేద్దాం అని అన్నాడట సురేష్ బాబు .

అగ్ర నిర్మాత సురేష్ బాబు కు కథ ఓ పట్టాన నచ్చదు . కథ ఒప్పించినా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ మాత్రం ఒప్పించడం ఇంకా కష్టం దాంతో ఈ నిర్మాత సినిమాలు తక్కువగా చేస్తుంటాడు . ప్రకటించిన అన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళవు . వెంకటేష్ – నాగచైతన్య ఇద్దరు కూడా నిజంగా మామా – అల్లుళ్ళు దాంతో ఈ సినిమాకు అనూహ్యంగా క్రేజ్ వచ్చింది . అయితే ఆ క్రేజ్ మాట ఏంటో కానీ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది . బాబీ జై లవకుశ తర్వాత ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు కానీ ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు మరి .

- Advertisement -

English Title: Multi starrer movie Venky mama shelved

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All