Homeటాప్ స్టోరీస్"ముద్దుగారే యశోద" వెబ్ సిరీస్ కాదు సినిమా - సింగర్ సునీత

“ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ కాదు సినిమా – సింగర్ సునీత

mudhugare yashoda is not web series its movieసమీర్ ,పవిత్ర లోకేష్ ,మధుమని ,శృతి తదితరులు నటించిన “ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ స్పెషల్ షో ని ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖుల కోసం ప్రదర్శించడం జరిగింది ,సింగర్ సునీత ,ఉత్తేజ్ ,బిత్తిరి సత్తి ,కళ్యాణి మల్లిక్ పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు .

సింగర్ సునీత మాట్లాడుతూ దర్శకురాలు శ్రీ చైతూ ఇదివరకే నాతో రాగం అనే షార్ట్ ఫిలిం చేసింది నాకు చాలా ఇష్టమైన సినిమా అది ,ఇప్పుడు చాలా మంచి టైటిల్ తో “ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ చేసింది నాకయితే సినిమా చూసినట్టే అనిపించి ,ఇందులో నటించిన పిల్లలు చాలా బాగా చేసారు .శ్రీ చైతూ త్వరలో సినిమా తో మన ముందు రాబోతుంది .

- Advertisement -

ప్రొడ్యూసర్ రాజ్ రాచూరి మాట్లాడుతూ డైరెక్టర్ శ్రీ చైతూ నా స్నేహితురాలు ఆమెకి చాలా విజన్ ఉంది ,చాలా కష్టపడుతుంది అనుకున్నది చేస్తుంది .త్వరలోనే మేము మూడు భాషల్లో సినిమా ని కూడా నిర్మిస్తున్నాము ఈ వెబ్ సిరీస్ ని ఆదరించినట్టే సినిమా ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు .

దర్శకురాలు శ్రీ చైతూ : మా మొదటి షార్ట్ ఫిలిం “రాగం” నాకు చాలా ఎక్సపీరియెన్స్ ఇచ్చింది ,నా టర్నింగ్ పాయింట్ కూడా అదే అందుకు నేను సునీత అక్క కి రుణపడి ఉంటాను ఇందులో “ముద్దుగారే యశోద” సునీత గారు వాయిస్ కూడా ఇచ్చారు ఇలా అందరూ నాకు హెల్ప్ చేసారు .ఇందులో చేసిన పవిత్ర లోకేష్ గారు ,సమీర్ గారు నా డి.ఓ .పి సిద్దు,గోపి ,శృతి ,మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణి మల్లిక్ గారు అందరూ నాకు సహకరించారు.మీ అందరి అశీసులతో త్వరలో సినిమాతో కూడా మీ ముందుకు వస్తాము .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All