Homeన్యూస్"మిస్టర్ కళ్యాణ్'' సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను : మల్లారెడ్డి గారు

“మిస్టర్ కళ్యాణ్” సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను : మల్లారెడ్డి గారు

"మిస్టర్ కళ్యాణ్'' సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను : మల్లారెడ్డి గారు
“మిస్టర్ కళ్యాణ్” సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను : మల్లారెడ్డి గారు

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.

మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ ను దర్శకులు నక్కిన త్రినాధ్ రావు విడుదల చేశారు అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ ను నటుడు ఆకాశ్ పూరి విడుదల చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు మాట్లాడుతూ…
మార్చి 10న విడుదల కాబోతున్న మిస్టర్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలి, అలాగే నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి గారికి దర్శకుడు పండు కు ఇతర నటీనటులకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.

సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది.

నటీనటులు:
మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: పండు
నిర్మాత: సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్
పీఆర్ఒ: శ్రీధర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All