Homeఎక్స్ క్లూసివ్లోక్ సభలో గర్జించిన మహేష్ బావ

లోక్ సభలో గర్జించిన మహేష్ బావ

మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గలా జయదేవ్ నిన్న పార్లమెంట్ లో మాట్లాడిన తీరుకి తెలుగువాళ్లు జేజేలు పలుకుతున్నారు . కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ గల్లా గర్జించిన తీరు కి ప్రశంసల వర్షం కురుస్తోంది . బిజెపి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ గల్లా పేల్చిన డైలాగ్స్ డైనమైట్ లా పేలాయి . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని , మాటమార్చి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు ఇప్పుడు అది కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఊసెత్తకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్లక్ష్యానికి గురి చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు .

తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు లోకసభ లో నిరసన తెలిపారు ,అయితే ప్రధాని మాట్లాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఏమైనా హామీలు ఇస్తారేమో అని అనుకున్నారు కానీ ఎంతసేపు కాంగ్రెస్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు . దాంతో గల్లా జయదేవ్ మోడీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All