Homeటాప్ స్టోరీస్రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్

రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్

నటీనటులు ; తాప్సీ , రవీంద్ర విజయ్, సత్యం రాజేష్ తదితరులు
డైరెక్టర్ : స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె
మ్యూజిక్ డైరెక్టర్ : మార్క్‌ కె రాబిన్‌
నిర్మాతలు : నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 01, 2022
రేటింగ్ : 2.75/5

mishan impossible Review
mishan impossible Review

తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ మిషన్ ఇంపాజిబుల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈరోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే..తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లకు చదవు ను పక్కనపెట్టి.. ఎలాగైనా డబ్బులు సంపాదించి, ఫేమస్‌ కావాలని అనుకుంటారు. డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న క్రమంలో.. దావూద్‌ని పట్టిస్తే..రూ.50 లక్షల బహుమతి పొందొచ్చు అనే వార్త టీవీలో వస్తుంది. అది చూసి దావుద్‌ని పట్టించి, రూ.50 లక్షల బహుమతి దక్కించుకోవాలని ఆ ముగ్గురు.. ఇంట్లో చెప్పకుండా ముంబైకి బయలు దేరుతారు. మరి ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? వీరికి శైలజ అలియాస్‌ శైలు(తాప్సీ) కి సంబధం ఏంటి..? అసలు శైలు ఎవరు..? అనేది అసలు కథ.

- Advertisement -

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* కామెడీ

మైనస్ :

* సాగదీత సన్నివేశాలు

నటీనటుల తీరు :

* తాప్సీ చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన తెలుగు సినిమా ఇది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ క‌నిపించ‌దు. సెకండాఫ్‌లోనే ఆమె పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది.

* ఇక సినిమాకు ప్రధాన బలం రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ నటన అనే చెప్పాలి. రఘుపతి, రాఘవ, రాజారాం అనే కుర్రాళ్ల పాత్రల్లో ఈ ముగ్గురు ఒదిగిపోయారు. తమదైన కామెడీతో నవ్వించారు.

* మిగతా వారు వారి పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం :

* దీప‌క్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.
* మార్క్ కె.రాబిన్ సంగీతంలో పాటలు సంద‌ర్భాను సారం సాగుతాయి
* సినిమా నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.
* డైరెక్టర్ విషయానికి వస్తే ..హ్యుమ‌న్ ట్రాఫికింగ్ అనే పాయింట్‌ను స్వ‌రూప్ చెప్పే క్ర‌మంలోనే మిష‌న్ ఇంపాజిబుల్ సినిమాను ర‌న్ చేశారు. అస‌లు ముగ్గురు కుర్రాళ్లు ఓ మ‌హా న‌గ‌రంలో దావూద్ ఇబ్ర‌హీంను ప‌ట్టుకోవాల‌నుకోవ‌డం.. వారు ప‌డే బాధ‌లు.. ఆ స‌మ‌యంలో వాళ్ల‌కి తాప్సీ ప‌రిచ‌యం కావ‌డం.. వాళ్ల‌ను ఉప‌యోగించుకుని ఆమె స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించిందనేది ఆస‌క్తిక‌ర‌మైన విధానంలో సాగింది. ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ ఆస‌క్తిక‌రంగా అనిపించింది.

ఓవరాల్ గా మిష‌న్ ఇంపాజిబుల్ ..జస్ట్ వన్ టైం చూడొచ్చు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All