Homeటాప్ స్టోరీస్గోండు బెబ్బులి వ‌చ్చేసింది.. విజువ‌ల్స్ రోమాంచితం!

గోండు బెబ్బులి వ‌చ్చేసింది.. విజువ‌ల్స్ రోమాంచితం!

గోండు బెబ్బులి వ‌చ్చేసింది.. విజువ‌ల్స్ రోమాంచితం!
గోండు బెబ్బులి వ‌చ్చేసింది.. విజువ‌ల్స్ రోమాంచితం!

రామరాజు ఫ‌ర్ భీమ్ పేరుతో ఎన్టీఆర్ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నామంటూ ఇటీవ‌ల రాజ‌మౌళి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఉద‌యం నుంచి దీనిపై హైడ్రామా న‌డిచింది. 30 నిమిషాలు ప్లీజ్ అంటూ వైట్ పిల్లి గిఫ్‌ల‌ని పోస్ట్ చేశారు రాజ‌మౌళి. మొత్తానికి అనుకున్న‌ట్టుగానే రామ‌రాజు ఫ‌ర్ భీమ్ టీజ‌ర్ వ‌చ్చేసింది. రామరాజుని మించి భీం విజువ‌ల్ ఫీస్ట్‌గా వుంటుంద‌ని ఊహించిన‌ట్టు టీజ‌ర్‌లోని స‌న్నివేశాలున్నాయి.

ఈ టీజ‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ వాయి ఓవ‌ర్ అందించారు. 11:30 నిమిషాల‌కు చెప్పిన‌ట్టుగానే రామ్‌చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు మార్వ‌లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. అంద‌మైన అడ‌వి… చుట్టూ కొండ‌లు.. పారేటి సెల‌యేళ్లతో రామ‌రాజు ఫ‌ర్ భీమ్ టీజ‌ర్ విజువ‌ల్స్ మొద‌ల‌య్యాయి.. వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయ్‌.. అంటూ రామ్‌చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ మొద‌లైంది.. విజువ‌ల్స్ ఐ ఫీస్ట్ అని చెప్పాల్సిందే.. `నిబ‌డితే…సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌త‌య్‌…వాడి పొగ‌రు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీక‌ట్ల‌ని చీల్చే మండుటెండా…వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్యం ముద్దు బిడ్డ రా త‌మ్ముడు గోండు బెబ్బులి కొమురంభీం.. అంటూ వాయిస్ ఓవ‌ర్ ముగిస్తే విజువ‌ల్స్ రోమాంచితంగా వున్నాయి.

- Advertisement -

`బాహుబ‌లి`లో ఒక‌టి రెండు సీన్లే రోమాంచితంగా వున్నాయి కానీ `ఆర్ఆర్ఆర్‌`లో మాత్రం ప్ర‌తీ స‌న్నివేశం రోమాంచిత‌మే అన్నట్టుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన స‌న్నివేశాలు విజువ‌ల్ ఫీస్ట్‌గా వున్నాయి. టీజ‌ర్ చివ‌రిలో త‌ల‌కు ముస్లీమ్‌లు ధ‌రించే రౌండ్ టోపీ ధ‌రించి ఎన్టీఆర్‌ని ఎందుకు చూపించారో అర్థం కావ‌డం లేదు. కొమ‌రం భీం 119వ జ‌యంతి సంద‌ర్భంగా ఈ టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన‌ట్టు టైటిల్స్ వేశారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All