Homeటాప్ స్టోరీస్సాహో కు నైజాం లో అంత రేటా ?

సాహో కు నైజాం లో అంత రేటా ?

 Mind blowing offer to Saaho nizam rights

ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సాహో . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 15 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని నైజాం లో విడుదల చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక ఈ చిత్ర హక్కుల కోసం కేవలం తెలంగాణ కే 45 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చాడట. ఇంకా లెక్కలు తేలలేదు కానీ 45 కోట్ల దగ్గర డీల్ సెట్ అయ్యేలా కనిపిస్తోందని అంటున్నారు.

- Advertisement -

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. రన్ రాజా రన్ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ తో పెద్ద సాహసమే చేస్తున్నారు యువి క్రియేషన్స్. తెలుగు , హిందీ , తమిళ , మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్ర హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. దాంతో నైజాం లో సాహో చిత్రాన్ని విడుదల చేయడానికి దిల్ రాజు పెద్ద ఆఫర్ ఇవ్వడంతో అది సెట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటించిన ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All