Homeటాప్ స్టోరీస్అమలా పాల్ ని కూడా వేధించాడట

అమలా పాల్ ని కూడా వేధించాడట

#Metoo : Amala paul sensational comments on tamil directorతమిళ దర్శకులు సుశీ గణేషన్ నన్ను కూడా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ అమలా పాల్ . సుశీ గణేషన్ పై ఇప్పటికే ఆరోపణలు రాగా వాటికీ ఊతమిచ్చేలా అమలా పాల్ వ్యాఖ్యానించింది . అంతేకాదు సుశీ గణేషన్ పైనే కాకుండా అతడి భార్య పై కూడా ఆరోపణలు చేస్తోంది అమలా పాల్ . సుశీ గణేషన్ నాపై లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో అతడి భార్య నా పక్కనే ఉందని , అయినప్పటికీ అతడికి అభ్యంతరం చెప్పకపోగా మరింతగా రెచ్చగొట్టిందని దాంతో నేను షాక్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది అమలా పాల్ .

అంతేకాదు అమలా పాల్ కు ఫోన్ చేసి బూతులు తిట్టారట భార్యాభర్తలు ఇద్దరూ . సుశీ గణేషన్ మంచి వ్యక్తీ కాదని అలాగే అతడి భార్య కూడా అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది అమలా పాల్ . సుశీ గణేషన్ పై ఇటీవలే ఓ మహిళా దర్శకురాలు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . ఆమెకు మద్దతుగా వ్యాఖ్యానించింది అమలా పాల్ . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన అమలా పాల్ పెళ్ళి చేసుకున్న విజయ్ కి విడాకులు ఇచ్చకా మరింత బిజీ అయ్యింది అలాగే మరింత హాట్ గా నటిస్తోంది .

- Advertisement -

English Title: #Metoo : Amala paul sensational comments on tamil director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All