Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కి జాక్వెలిన్ హోలీ గిఫ్ట్ – “మేరే అంగనే మే”

ఫ్యాన్స్ కి జాక్వెలిన్ హోలీ గిఫ్ట్ – “మేరే అంగనే మే”

ఫ్యాన్స్ కి జాక్వెలిన్ హోలీ గిఫ్ట్ – “మేరే అంగనే మే”
ఫ్యాన్స్ కి జాక్వెలిన్ హోలీ గిఫ్ట్ – “మేరే అంగనే మే”

ఇండస్ట్రీ లో ప్రాజెక్ట్ లు రెండు రకాలు. ముందు కథ, కాన్సెప్ట్, కంటెంట్, క్యాస్టింగ్ ఇలా అన్నీ ముందు రెడీ చేసుకుని… ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విధానం, ఒక విజన్ ఇలా చేసి… చివరకు వచ్చిన ప్రోడక్ట్ తో వ్యాపారం చేసుకోవడం ఒక పద్ధతి. ఇక రెండో బ్యాచ్ గురించి చెప్పాలంటే… ఎదో ఒకటి చేసేసి, ఎలాగు చేసిన తరువాత అది ఎలా ఉన్నా, అద్భుతం, అమోఘం అని ఆడియెన్స్ పై రుద్దటానికి క్రేజ్ మరియు ప్రమోషన్ అనే ఆయుధాలు ఉన్నాయి కదా…. అని కనీసం రాసింది, తీసింది,చేసింది వాళ్ళకు కూడా క్లారిటీ మిస్ అయ్యేలా కళాఖండాలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం హోలీ పండుగ కాబట్టి, శ్రీలంక సుందరి జాక్వెలిన్ నటించిన ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆల్ టైం హిట్ సాంగ్ అయిన “మేరేఅంగనే మే” పాటను హుక్ లైన్ గా తీసుకుని హోలీ ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో, ఒక బాయ్ ఫ్రెండ్ & గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే ఒక చిన్న సరదా గొడవను చూపించారు. క్రీ.శ 1435 లో ఒక రాజకుమారికి ఇష్టం లేని పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆమె ఆ బాధతో ఈతకొలను లో స్నానం చేస్తూ ఉండగా, అదే సమయానికి 2020లో ఒక ప్రేమ జంట హోలీ సెలబ్రేషన్స్కి వస్తుంది. అక్కడ తన లవర్ ని వదిలేసి, వేరొక అమ్మాయితో హీరో రోమాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కోపంతో హీరోయిన్, హీరోను 1435 కి పంపిస్తుంది.

- Advertisement -

అక్కడ అదే సమయానికి ఉన్న రాజకుమారితో మన హీరో హై హీల్స్ చెప్పులు, స్మార్ట్ మొబైల్ ఇచ్చి మంచి చేసుకుంటాడు. రాజభటులు బంధించాలని చూడగా, స్మార్ట్ ఫోన్ తో భయపెట్టి, అక్కడనుండి ఎస్కేప్ అవుతూ, రాజకుమారిని కూడా తనతో రమ్మనే సమయానికి మళ్ళీ హీరోయిన్ మనోడిని ప్రెజెంట్ కాలానికి లాగేస్తుంది. అతనితో పాటు యువరాణి జాక్వేలిన్ కూడా వచ్చేస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఆ విధంగా యువరాణి ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుంది అనీ ఎండ్ చేసారు. జాక్వెలిన్ గ్లామర్ తప్ప పాటలో.. టెక్నికల్ గా, టేకింగ్ పరంగా ఏమీ లేదు. అయినా ఈ పాట త్రెందింగ్ లో ఉంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All