
కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్ కౌర్, ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. కెరీర్ లో రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్2 హిట్స్ కొట్టింది. ఆ తర్వాత మెహ్రీన్ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. రాజకీయ నాయకుడు భవ్యతో ఆమె నిశ్చితార్ధం వరకూ వెళ్ళింది. పెళ్ళైన తర్వాత సినిమాలు కూడా మానేస్తానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఎఫ్3 ఆమె కెరీర్ లో చివరి చిత్రమని అనుకున్నారంతా.
కానీ అనూహ్యంగా నిశ్చితార్ధానికి ముందే ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో తిరిగి సినిమాలు చేయాలని డిసైడ్ అయింది. దాంతో పాటు అప్పటివరకూ గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకున్న మెహ్రీన్ ..ఆ తర్వాత హద్దులను చెరిపేస్తుంది. వరుస హాట్ హాట్ షూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ఇప్పుడు ఏకంగా బికినీ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఆమెను తొలిసారి ఇలా చూసిన వాళ్లందరూ షాక్‌కు గురవుతున్నారు. మెహ్రీన్ ఇది నువ్వేనా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారింది.