Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ లేకుండానే `లూసీప‌ర్` రీమేక్ షూట్‌!

మెగాస్టార్ లేకుండానే `లూసీప‌ర్` రీమేక్ షూట్‌!

మెగాస్టార్ లేకుండానే `లూసీప‌ర్` రీమేక్ షూట్‌!
మెగాస్టార్ లేకుండానే `లూసీప‌ర్` రీమేక్ షూట్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుంత `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవంఈ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, చ‌ర‌ణ్‌కు జ‌త‌గా పూజా హెగ్డే క‌నిపించ‌బోతోంది.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్‌ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ రీమేక్‌కు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇప్న‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీని వ‌చ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. అయితే చిరు లేకుండానే `లూసీఫ‌ర్‌` రీమేక్‌ని స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి చిరు త‌రువాత స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తారల‌ని మాత్ర‌మే ఫైన‌ల్ చేశారు. మిగ‌తా పాత్ర‌ల ఎంపిక జ‌ర‌గాల్సి వుంది. కానీ ఇంకా ఎలాంటి క‌ద‌లిక‌లేదు. అయితే ఈ లోగా చిరు `ఆచార్య‌` షూట్‌ని పూర్తి చేసుకునేలోపు మిగ‌తా సీన్‌ల‌ని పూర్తి చేసి చిరు ఎంట్రీ కోసం ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా వేయిట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts