Homeటాప్ స్టోరీస్చిన్న సినిమాకి మెగా బూస్టింగ్.. అద్భుతం అంటూ..!

చిన్న సినిమాకి మెగా బూస్టింగ్.. అద్భుతం అంటూ..!

Megastar Chiranjeevi Support to Teja Sajja Adbhutam Movie

యువ హీరో తేజా సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా నటించిన సినిమా అద్భుతం. డిస్నీ హాట్ స్టార్ లో నవంబర్ 19న డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఇచ్చారు. అద్భుతం సినిమా చూసిన చిరంజీవి సినిమా గురించి ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు. లాస్ట్ నైట్ డిస్నీ హాట్ స్టార్ లో అద్భుతం సినిమా చూశానని.. న్యూ ఏజ్ మూవీగా నావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారని అన్నారు. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ ల పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయని.

- Advertisement -

ఈ యంగ్ టీం కు మంచి ఫ్యూచర్ ఉంటుందని. అద్భుతం టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలో చైల్డ్ రోల్ చేసిన తేజా సజ్జా తన ప్రతి సినిమాకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగా తీసుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All