Homeఎక్స్ క్లూసివ్నాగశౌర్య సినిమాకు గెస్ట్ చిరు

నాగశౌర్య సినిమాకు గెస్ట్ చిరు

మెగాస్టార్ చిరంజీవి నాగశౌర్య సినిమాకు గెస్ట్ గా హాజరుకానున్నాడు . రేపు హైదరాబాద్ లో ఈ వేడుకని అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు  చలో చిత్ర బృందం . నాగశౌర్య – రష్మిక జంటగా నటిస్తున్న చలో చిత్రంతో వెంకీ కుడుమల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . నాగశౌర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చలో పై నాగశౌర్య భారీగానే ఆశలు పెట్టుకున్నాడు . 
 
ఫిబ్రవరి 2న సినిమా రిలీజ్ అవుతుండటంతో మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథి గా ఆహ్వానించారు దాంతో చిరు సంతోషంగా ఈ వేడుకకు వస్తానని ఒప్పుకోవడంతో రేపు సాయంత్రం భారీ ఎత్తున ఈవెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసారు . నాగశౌర్య హీరోగా సక్సెస్ లు సాధించినప్పటికీ అనుకున్న రేంజ్ లో ఇమేజ్ రాలేదు దాంతో చలో తో భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు . సాలిడ్ హిట్ కొట్టి స్టార్ డం పొందుతాడా చూడాలి . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All