Homeటాప్ స్టోరీస్ప‌దిహేనేళ్ల త‌రువాత మ‌ళ్లీ జోడీగా..?

ప‌దిహేనేళ్ల త‌రువాత మ‌ళ్లీ జోడీగా..?

ప‌దిహేనేళ్ల త‌రువాత మ‌ళ్లీ జోడీగా..?
ప‌దిహేనేళ్ల త‌రువాత మ‌ళ్లీ జోడీగా..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మెగా ప‌వ‌ర్‌స్టార్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. అదే మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లలూసీఫ‌ర్` రీమేక్‌ని ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలతో ప్రారంభించారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిం కాబోతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మోహ‌న్‌రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

- Advertisement -

ఇందులో చిరుకు జోడీగా త్రిష న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయ‌. 15 ఏళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి న‌టించ‌బోతున్నారు. 15 ఏళ్ల క్రితం వీరిద్ద‌రు `స్టాలిన్‌` చిత్రంలో కలిసి న‌టించారు. `ఆచార్య‌`లో న‌టించాల్సి వుండ‌గా కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల త్రిష ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. తాజాగా `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టించ‌డానికి త్రిష గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే ఈ చిత్ర మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All