Homeటాప్ స్టోరీస్స్టైలిష్ స్టార్ కలెక్షన్స్ రేటుకి మెగాస్టార్ రైట్స్

స్టైలిష్ స్టార్ కలెక్షన్స్ రేటుకి మెగాస్టార్ రైట్స్

 

Megastar Aacharya Movie Business records
Megastar Aacharya Movie Business records

పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించిన “నేనింతే” సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో ఒక హీరో వీరాభిమాని మరొక హీరో వీరాభిమానిని కొడుతూ ఒక డైలాగ్ చెప్తాడు. మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదు రా మొత్తం హీరో లైఫ్. మీకెందుకురా.? మాతో కాంపిటీషన్ అనీ..! ఇందులో ఉన్న పాయింట్ ని ఒక్కసారి సింక్ చేసుకుంటే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా మరియు అల్లు అర్జున్ సినిమాల కలెక్షన్స్ మరియు రైట్స్ విషయం దీనికి కొద్దిగా దగ్గరగా ఉంది.

- Advertisement -

విషయానికి వస్తే, ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన “అల.. వైకుంఠపురం సినిమా” తో బన్నీ మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ఇక మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలు అందరూ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అసలు మెయిన్ పిల్లర్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కథకు సంబంధించి ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే మరొక పెద్ద హీరో గురించి అనేక ఫ్యాన్ స్టోరీస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక తాజాగా రిలీజ్ అయిన మరొక వార్త కూడా సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ గారు నటించిన అల.. వైకుంఠపురం సినిమా నైజాం మొత్తం కలెక్షన్స్ 40 కోట్లు అయితే; మెగాస్టార్ చిరంజీవి గారి నటిస్తున్న ఆచార్య సినిమా నైజాం రైట్స్ 40 కోట్లకు అడుగుతున్నారట… ఇక రైట్స్ ఈ స్థాయిలో ఉన్నాయంటే సినిమా కలెక్షన్స్ ఏ మేరకు టార్గెట్ చేయబడ్డాయి.? మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎంతైనా ఇండస్ట్రీ నెంబర్ 1 హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆ మాత్రం ఉండాలి కదా..! పైగా దర్శకుడు కొరటాల శివ గారికి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేదు ఆయన దర్శకత్వం వహించిన నాలుగు సినిమాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి.ఇక విడుదల అయ్యేలోపు మెగాస్టార్ ఆచార్య ఇంకా… ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడు వేచిచూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All