Homeఎక్స్ క్లూసివ్బోయపాటి ఏంటి ఈ తీత ?

బోయపాటి ఏంటి ఈ తీత ?

Mega fans shocked with Boyapati srinu మాస్ దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం ” వినయ విధేయ రామ ” . రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . చరణ్ రంగస్థలం తర్వాత నటిస్తున్న చిత్రం కావడం , బోయపాటి శ్రీను  దర్శకుడు కావడంతో వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది వినయ విధేయ రామ చిత్రం .
బోయపాటి శ్రీను మొదటిసారిగా దర్శకుడిగా విఫలమయ్యాడు . ఇప్పటివరకు చేసిన సినిమాలలో జయ జానకి నాయక , దమ్ము చిత్రాలు మాత్రమే అట్టర్ ప్లాప్ అయ్యాయి అయితే దమ్ము లో ఓ నీతి ఉంది , జయ జానకి నాయక చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి పేరు వచ్చింది కానీ వినయ విధేయ రామ చిత్రం ఆ చిత్రాల కంటే దారుణమైన పరాజయం పొందేలా ఉంది . ఎందుకంటే అంత దారుణంగా ఉంది సినిమా . రాంబో గెటప్ ఫైట్ తప్ప మిగతా సినిమాలో బోయపాటి తీత ఏంటో అర్ధం కాక మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు మరి . కథ , కథనం దారుణంగా ఉంది దాంతో బోయపాటి శ్రీను కెరీర్ లో నెంబర్ వన్ డిజాస్టర్ అయినట్లే ఈ వినయ విధేయ రామ .

English Title: Mega fans shocked with Boyapati srinu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All