Homeటాప్ స్టోరీస్మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ
మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, వాణి భోజన్, అవంతిక మిశ్రా, అనసూయ తదితరులు
సంగీతం: శివకుమార్
దర్శకుడు: షామీర్ సుల్తాన్
నిర్మాత: విజయ్ దేవరకొండ
విడుదల తేదీ: 1 నవంబర్ 2019
రేటింగ్: 2.5/5

హీరోగా ఇప్పటికే నిరూపించుకున్న విజయ్ దేవరకొండ కెరీర్ తొలినాళ్లలోనే నిర్మాత అవతారం ఎత్తాడు. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ ను స్థాపించి కొత్త దర్శకుడితో దాదాపు కొత్త నటీనటులతో మీకు మాత్రమే చెప్తా అనే చిత్రాన్ని నిర్మించాడు. విడుదలకు ముందు ప్రోమోల ద్వారా హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి మీకు మాత్రమే చెప్తా గురించి అందరికీ చెప్పొచ్చో లేదో తెలుసుకుందాం.

- Advertisement -

కథ:
రాకేష్ (తరుణ్ భాస్కర్) ఒక టెలివిజన్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తుంటాడు. తన జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో డాక్టర్ (వాణి భోజన్)ను చూసి లవ్ లో పడతాడు. అన్నీ సవ్యంగా జరిగి మరో రెండో రోజుల్లో వీరిద్దరికీ పెళ్లి అనగా, రాకేష్ ఉన్న ఫసక్ వీడియో ఒకటి నెట్ లో ట్రెండవుతూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది. ఆ వీడియోను నెట్ నుండి రాకేష్ తీయగలిగాడా? వాణి భోజన్ కంట పడకుండా ఆ వీడియోను ఉంచగలిగాడా?? చివరికి ఏమవుతుంది? ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
దర్శకుడిగా రెండు సినిమాలతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మరి తరుణ్ భాస్కర్ లో ఏం చూసి హీరోగా చేయించొచ్చు అనుకున్నారో కానీ అది చాలా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. తనదైన అమాయకత్వపు నటనతో తరుణ్ భాస్కర్, రాకేష్ పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా తన వీడియో నెట్ లో హల్చల్ చేస్తోంది అన్న దగ్గరనుండి తరుణ్ టెన్షన్ పడుతూ నటించే సీన్స్ అన్నీ బాగా కుదిరాయి. క్లైమాక్స్ లో కూడా తరుణ్ భాస్కర్ నటన ఆకట్టుకుంది.

వాణి భోజన్ గురించి చెప్పడానికేం లేదు. ఆమెకు అంత స్క్రీన్ స్పేస్ లేదు. అనసూయ రోల్ చిన్నదే అయినా కూడా ఆమె పాత్ర బాగుంది. ఇక తరుణ్ పక్కనే ఉండే అభినవ్ గోమటం క్యారెక్టర్ కూడా బాగా పేలింది. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు కూడా సూపర్బ్ గా వచ్చాయి. ఇక మిగిలిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు బాగానే రాణించారు.

సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రంలో సాంకేతిక నిపుణుల గురించి చర్చ వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించే. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా పర్వాలేదు. శివ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని కొత్త సౌండ్స్ ఇచ్చాడు. షామీర్ సుల్తాన్ దర్శకత్వంలో నిలకడ లేదు. స్క్రీన్ ప్లే లో అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ప్రేక్షకుడికి సినిమా మీద చూస్తున్నంత సేపూ ఆసక్తి నిలబడలేదు. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. రన్ టైమ్ తక్కువే ఉన్నా ఇంకా అనవసర సన్నివేశాలు చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. విచిత్రంగా ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాలేవు. విజయ్ దేవరకొండ నిర్మాణం విషయంలో కాంప్రమైజ్ అయ్యాడేమో అనిపిస్తుంది.

చివరిగా:
మీకు మాత్రమే చెప్తా ఓపెన్ అవ్వడం దగ్గరనుండి ఫస్ట్ హాఫ్ అంతా సరదాసరదాగా గడిచిపోతుంది. అయితే ఒక్కసారి సెకండ్ హాఫ్ కు వెళ్ళాక కథనం కూడా దారి తప్పుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే కామెడీ ఎంటర్టైనర్ ను దర్శకుడు ఇంకా బాగా హ్యాండిల్ చేయాల్సింది. కథ పల్చగా ఉన్నప్పుడు సన్నివేశాలు బలంగా ఉండాలి. మీకు మాత్రమే చెప్తాలో అదే లోపించింది. అందుకే సెకండ్ హాఫ్ చాలా చోట్ల రిపిటీటివ్ గా, బోరింగ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా సరిగా లేకపోవడంతో మీకు మాత్రమే చెప్తా ఒక యావరేజ్ కామెడీ ఎంటర్టైనర్ గా అనిపిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All