Homeటాప్ స్టోరీస్డైరెక్టర్ ని చెప్పుతో కొట్టిన భామ

డైరెక్టర్ ని చెప్పుతో కొట్టిన భామ

#Me too : Mumtaj answered with sandal to directorఅదేపనిగా లైంగికంగా వేధిస్తుండటంతో సహనం కోల్పోయి ఓ డైరెక్టర్ ని అందరి ముందే చెప్పుతో కొట్టాను దాంతో మళ్ళీ వేధించడం మానేసాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ ముంతాజ్ . ఐటెం గర్ల్ గా దక్షిణాదిన ఓ ఊపు ఊపేసిన భామ ముంతాజ్ . పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ ,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి కుర్రకారుని రెచ్చగొట్టింది . హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ అంటే పడిచచ్చే వాళ్ళు ఎందఱో ! దాంతో ఓ దర్శకుడు అదే పనిగా లైంగికంగా వేదించే వాడట ! అయితే డైరెక్టర్ కావడంతో కాస్త ఓపిక పట్టిందట ఇంకేముంది దాన్నే అలుసుగా తీసుకొని మరింత అసభ్యంగా తాకేవాడట ! అసభ్యంగా మాట్లాడేవాడట . అతడి వ్యవహారం మరీ శ్రుతిమించడంతో అందరి ముందే చెప్పుతో కొట్టిందట . దాంతో షాక్ అయ్యాడు అంతేకాదు యూనిట్ సభ్యులు కూడా ఏమి జరిగిందో తెలుసుకునే లోగా సంఘటన జరిగిపోవడంతో షాక్ కి లోనయ్యారట .

అయితే ఇన్ని చెబుతున్న ముంతాజ్ ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పడం లేదు . ఎందుకంటే అది కూడా చెబుతోంది ఆ సంఘటన ఇటీవల జరిగింది కాదు కాబట్టి మీటూ లో భాగం చేయదలచుకోలేదు అని అంటోంది . అంతేకాదు మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న వాళ్ళు తగిన ఆధారాలు ఉంటే బయటపెట్టాలి అంతేకాని ఊరికే ఆరోపణలు చేయడం ద్వారా మీటూ ఉద్యమం పక్కదారి పట్టే అవకాశం ఉందని చురకలు అంటించింది ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు .

- Advertisement -

English Title: #Me too : Mumtaj answered with sandal to director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All