Homeటాప్ స్టోరీస్మత్తు వదలరా రివ్యూ

మత్తు వదలరా రివ్యూ

Matthu Vadalara Movie Review in Telugu
Matthu Vadalara Movie Review in Telugu

మూవీ రివ్యూ: మత్తు వదలరా
నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ..
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాత: చిరంజీవి, హేమలత
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: కాల భైరవ
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2019
రేటింగ్: 3/5

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి తనయులు శ్రీసింహ హీరోగా, మరొకరు అయిన కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతూ నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రం ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించింది. న్యూ ఏజ్ థ్రిల్లర్ గా ప్రచారం కాబడ్డ ఈ చిత్రం అందరి అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

- Advertisement -

కథ:
బాబు (శ్రీ సింహా), అభి (నరేష్ అగస్త్య), ఏసుదాస్ (సత్య) రూమ్ మేట్స్. ఇందులో బాబు, ఏసుదాస్ కొరియర్ బాయ్స్ గా పనిచేస్తుంటారు. ఒకరోజు ఏసుదాస్ ఇచ్చిన ఒక ఐడియా విని అది ఫాలో అవుతాడు బాబు. దానివల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. దాన్నుండి బయటపడదామనుకునేలోపే మరో ఇబ్బందిలో కూరుకుపోతాడు. తను మాత్రమే కాక తన స్నేహితులు కూడా ఇందులోకి వచ్చి ఇరుక్కుంటారు. మత్తు వదలరా సినిమా మొత్తం వీరు తమకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నారు, వాటి పర్యావసానాలు ఏంటి అన్న పాయింట్ మీదే నడుస్తుంది.

నటీనటులు:
కీరవాణి కొడుకు శ్రీ సింహా ఉన్నంతలో బాగానే చేసాడు. అయితే అతను ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఈ పాత్రవరకూ కన్ఫ్యూజన్ లో ఉన్న పాత్రకు అతను న్యాయం చేసాడనే చెప్పాలి. మరో హీరో నరేష్ అగస్త్య మొదట్లో చాలా డల్ గా ఉన్నట్లు కనిపించాడు. అయితే ప్రీ క్లైమాక్స్ లో ఈ కుర్రాడు అదరగొట్టాడు. ఇక సత్య గురించి చెప్పేదేముంది. తనదైన శైలిలో కామెడీ పండించాడు. తన వన్ లైనర్స్ భలేగా వర్కౌట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత సత్యకు మళ్ళీ అదిరిపోయే రోల్ పడింది. అతుల్య చంద్ర ఉన్నది కాసేపే అయినా ఆకట్టుకుంటుంది.

ఇక మిగిలిన నటులైన బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పావలా శ్యామల తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన వారంతా ఓకే.

సాంకేతిక విభాగం:
మత్తు వదలరా సాంకేతికంగా ఉన్నతంగా తెరకెక్కింది. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. చాలా ట్రెండీ ఔట్పుట్ ఇచ్చాడు. గుడ్లగూబ సౌండ్ ను చాలా ఎఫెక్టివ్ గా వాడాడు. కెమెరా వర్క్ కూడా మెప్పిస్తుంది. కొన్ని భిన్నమైన యాంగిల్స్ వాడారు. క్లైమాక్స్ ఫైట్ లో ఇవి కొంత అసహనాన్ని కలిగించవచ్చు. ఎడిటింగ్ పర్వాలేదు, అయితే కొన్ని సన్నివేశాలు మరీ సాగుతున్న భావన కలుగుతున్నాయంటే అది ఎడిటింగ్ లో లోపమే అని చెప్పవచ్చు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ఇక రచయిత, దర్శకుడు రితేష్ రానా విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ లైన్ కు పంచ్ లు యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు. అయితే అందులో అతను పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. చాలా ఆసక్తికరంగా సినిమాను మొదలుపెట్టినా కథలో ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు.

విశ్లేషణ:
మత్తు వదలరా ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అయితే దర్శకుడు రితేష్ దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొంత తడబడ్డాడు. అయితే సత్య సినిమాను నిలబెట్టడానికి తనవంతు ప్రయత్నం చేసారు. సత్య కామెడీకే టికెట్ డబ్బులు చెల్లిపోతాయంటే అతిశయోక్తి లేదు. కథనాన్ని కొంత వేగంగా నడిపి ఉంటే ఫ్లో లో వచ్చే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకునేవి.
క్లైమాక్స్ ను సాగదీయడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. మొత్తంగా చూసుకుంటే మత్తు వదలరా ఒక ఆసక్తికర కాన్సెప్ట్ కు, సత్య కామెడీకి ఒకసారి చూడవచ్చు.

చివరిగా: మత్తు వదలరా- పూర్తిగా వదలదు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All