Homeఎక్స్ క్లూసివ్"డిస్కో రాజా"గా రాబోతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ

“డిస్కో రాజా”గా రాబోతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ

Mass Maharaj Raviteja is coming as “DiscoRaja”డిస్కో రాజా“గా రాబోతున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ మా డిస్కోరాజుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు – చిత్ర బృందం

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప‌ట్స్ ని త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ అటు విమ‌ర్శ‌కులు ఇటు ప్రేక్ష‌కుల‌ ఆద‌ర‌ణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్ట‌ర్ వి.ఐ.ఆనంద్ డైరెక్ష‌న్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని  అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎన‌ర్జీకి స‌రిపోయే విధంగా ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. జ‌న‌వ‌రి 26 రిప‌బ్లిక్ డే తో పాటు ర‌వితేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుద‌ల చేశారు.

 

- Advertisement -

 

 ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ… ముందుగా మా ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్  బ్యాన‌ర్ హీరో  మాస్ మహారాజా రవితేజ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. అలానే ప్రేక్ష‌కులు అంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. ర‌వితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. వినూత్న‌మైన క‌థ‌ల్ని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకురావ‌డంలో మా బ్యాన‌ర్ ఎల్ల‌ప్పూడు ముందు ఉంటుంది. ఈ నేప‌థ్యంతోనే దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఓ విన్నూత్న‌మైన ఆంశాన్ని ఈ సినిమా క‌థాంశంగా తీసుకున్నాం. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించబోతున్నాం. హైద‌రాబాద్ తో పాటు గోవా, చెన్నై, ల‌డాఖ్, మ‌నాలీలోతో పాటు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నాము. ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొద‌లుపెట్టిన రోజు నుంచే ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటూ వ‌చ్చాం. అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా ఈ సినిమా రూపొందించేందుకు మా బృందం మొత్తం ప్లాన్ చేస్తుంది. అందుకే అటు మాస్ ఇటు క్లాస్ ని ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఖారారు చేశాము. ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ తో పాటు టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ స్వ‌రాలు అందించబోతున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ గా సాయి శ్రీరామ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అబ్బూరి ర‌వి ఈ సినిమాకు మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ర‌వితేజ గారి స‌ర‌స‌న న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ న‌టుడు బాబీసింహా ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడుగా న‌టించ‌బోతున్నారు. క‌మీడియ‌న్స్ వెన్నెల‌కిషోర్, స‌త్య త‌దిత‌ర‌లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ షెడ్యూల్ ని ప్రారంభించేందుకు స‌న్నాహ‌లు చేస్తున్నాం అని తెలిపారు.

 

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్  : సాయి శ్రీరామ్
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను
న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు
English Title: Mass Maharaj Raviteja is coming as “DiscoRaja”
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts