Homeగాసిప్స్మారుతి, నాని కాంబో మళ్ళీ సెట్ అవుతోందా?

మారుతి, నాని కాంబో మళ్ళీ సెట్ అవుతోందా?

మారుతి, నాని కాంబో మళ్ళీ సెట్ అవుతోందా?
మారుతి, నాని కాంబో మళ్ళీ సెట్ అవుతోందా?

ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటే ఆటోమేట్టిగా అంచనాలు అన్నీ దానిమీద ఉంటాయి. అది సహజం. నాని కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా భలే భలే మగాడివోయ్ గురించి చెప్పుకోవచ్చు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నో సార్లు ఇద్దరూ కలిసి మళ్ళీ పనిచేద్దామని భావించారు, ప్రయత్నించారు కానీ ఏదీ సెట్ అవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా తెరకెక్కే సూచనలు కనిపిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి.

గతేడాది ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మారుతి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఆ స్క్రిప్ట్ నాని కోసమేనని అంటున్నారు. నానిని దృష్టిలో పెట్టుకుని ఒక పవర్ఫుల్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడని, అయితే ఇందులో మారుతి సినిమా నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా కచ్చితంగా ఉంటాయని తెలుస్తోంది.

- Advertisement -

అయితే ప్రస్తుతం నాని చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని కూడా చేయాల్సి ఉంది. ఈ రెండూ పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అంతకాలం మారుతి వెయిట్ చేస్తాడా లేక మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All