Homeటాప్ స్టోరీస్మంచి రోజులు వచ్చాయి : రివ్యూ

మంచి రోజులు వచ్చాయి : రివ్యూ

Maruthi Manchi Rojulu Vacchayi Review Rating
Maruthi Manchi Rojulu Vacchayi Review Rating

మారుతి డైరక్షన్ లో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన సినిమా మంచి రోజులు వచ్చాయి. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

- Advertisement -

తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్ (అజయ్ ఘోష్) తన కూతురు పద్మ (మెహ్రీన్ కౌర్) అంటే ప్రాణం. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న పద్మ తన కొలీగ్ సంతోష్ (సంతోష్ శోభన్) తో ప్రేమలో పడుతుంది. సంతోషంగా ప్రశాంతంగా ఉండే గోపాల్ ని చూసి ఆయన పక్కింటి వాళ్లు అతని కూతురు గురించి లేని పోని అనుమానాలు ఏర్పడేలా చేస్తారు. ఆయనలో ఒకరకమైన భయాన్ని సృష్టిస్తారు. ఇక వారు చెప్పినట్టుగానే గోపాల్ తన కూతురు ఏం చేస్తుందో అనే భయం మొదలవుతుంది. దీనికితోడుగా కరోనా భయం కూడా యాడ్ అవుతుంది. ఈ విషయాల మధ్య సంతోష్, పద్మల ప్రేమ ఎలా సాగింది..? గోపాల్ తన భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు..? మిగతా కథ ఎలా నడిచింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలతో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు మారుతి. ఈ విషయంలో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ఏర్పరచుకున్నాడని చెప్పొచ్చు. తను తీసిన నాని భలే భలే మగాడివోయ్ సినిమా.. మహానుభావుడు సినిమాల తరహాలోనే మంచి రోజులు వచ్చాయి సినిమాలో హీరోయిన్ ఫాదర్ కు భయం అన్న కాన్సెప్ట్ యాడ్ చేశాడు.

ఈ సినిమాలో కూడా కథ అంత గొప్పగా లేకపోయినా కథనం.. పాత్రల స్వభావాల మీద సినిమా లాగించేశాడు డైరక్టర్ మారుతి. ఇక ఇలాంటి సినిమాల విషయంలో లాజిక్ లు పక్కన పెట్టేయాల్సిందే. అందుకే జస్ట్ సినిమాను ఎంజాయ్ చేయడమే తప్ప అది అలా ఎందుకు.. ఇది ఇలా ఎందుకు అని ఆలోచించకూడదు. సినిమా ద్వారా ప్రేక్షకులను నవ్వించాలి అన్న విషయంలో మాత్రం మారుతి సక్సెస్ అయ్యాడు.

ఎక్కువగా సోష మీడియాలో వినపడే ట్రోల్స్, వైరల్ న్యూస్ ల గురించి కూడా మారుతి తన సినిమాల్లో ప్రస్థావిస్తాడు. మంచి రోజులు వచ్చాయి ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ అదే కామెడీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా మంచి రోజులు వచ్చాయి ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

సంతోష్ శోభన్ తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. మెహ్రీన్ కౌర్ కూడా ఆకట్టుకుంది. సంతోష్, మెహ్రీన్ ల జోడీ అలరించిది. ఇక సినిమాలో ప్రధాన పాత్రదారుడు అజయ్ ఘోష్ తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతని కెరియర్ లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సప్తగిరి, వెన్నెల కిశోర్ పాత్రలు నవ్వులు పండిస్తాయి. సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సాయి శ్రీరాం కెమెరా వర్క్ బాగుంది. అనూప్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. డైరక్టర్ మారుతి తను రాసుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు. ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ ను అతని రీచ్ అయ్యాడని చెప్పొచ్చు. యువి కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ

అజయ్ ఘోష్

మ్యూజిక్

హీరో, హీరోయిన్

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ట్విస్టులు లేని కథ

అక్కడక్కడ రిపీటెడ్ సీన్స్ లా అనిపించడం

బాటం లైన్ :

మంచి రోజులు వచ్చాయి.. సరదాగా నవ్వుకునేందుకు ఓసారి చూసేయొచ్చు..!

రేటింగ్ : 3/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All