Homeటాప్ స్టోరీస్అరేబియా సింహం“కుంజాలి” వచ్చేసాడు - “మరక్కార్” ట్రైలర్

అరేబియా సింహం“కుంజాలి” వచ్చేసాడు – “మరక్కార్” ట్రైలర్

అరేబియా సింహం“కుంజాలి” వచ్చేసాడు - “మరక్కార్” ట్రైలర్
అరేబియా సింహం“కుంజాలి” వచ్చేసాడు – “మరక్కార్” ట్రైలర్

ప్రాచీన భారతదేశంలో అటు వంగ రాజ్యం నుండి మొదలుపెడితే ఇటు సౌరాష్ట్రం వరకూ, అంటే బెంగాల్ రాష్ట్రం నుండి గుజరాత్ వరకూ, అనేక వేల కిలోమీటర్ల పొడవున ఉన్న తీరరేఖ ద్వారా నౌకాయానం, ఓడలు, ఎగుమతులు, అనేక దేశాలకు జరిగేవి. భారతదేశాన్ని ఆక్రమించిన పరాయి పాలకులను కూడా మొట్టమొదట ఆకర్షించినవి ఇవే. ఇతరదేశాల వాళ్ళు కనీసం 20 టన్నుల బరువు కూడా మోయ్యలేని ఓడలలో తిరుగుతూ ఉంటే, భారతీయులు 300 టన్నుల బరువు దాకా మోసే ఓడలలో తిరిగేవారు.

ఇప్పుడు అలాంటి గొప్ప చరిత్రతోపాటు, స్వాతంత్ర్య పోరాటాన్ని మనకు సినిమాగా చూపిస్తున్నారు, దర్శకులు ప్రియదర్శన్ గారు. “కాంజీవరం” లాంటి నేషనల్ అవార్డు సినిమాలతోపాటు “”మనుచిత్రతాజు” (చంద్రముఖి) లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ లు డీల్ చేసే ప్రియదర్శన్ సార్ ఇప్పుడు మళ్ళీ ఈ భారీ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో “కుంజాలీ మరక్కర్ IV” క్యారెక్టర్ లో ఒదిగిపోయారు మోహన్ లాల్.

- Advertisement -

ఇటీవలే “లూసీఫర్” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మళ్ళీ తన స్టామినా చూపించిన మోహన్ లాల్ గారు ఈ సినిమాను సుమారు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక హీరో ఫ్రెండ్ మలబార్ రాజు “ఆనందన్” పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపిస్తున్నారు. “ఖదీజమ్మ” పాత్రలో సుహాసినీ మణిరత్నం; “ఆర్చ” పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ఆనాటి భారతదేశ గొప్పతనం, నావికుల సమర్ధత, దేశభక్తి ఇలా అన్నీ అంశాలు హైలెట్ చేసారు. ముఖ్యంగా ఫిరంగి గుండు సౌండ్ లను సింక్ చేస్తూ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ గా ఉంది.

మోహాన్ లాల్ గారు ఎప్పటిలాగే తనదైన సహజమైన నటన, హావభావాలతో పాటు, సహజమైన మేకప్ లుక్ తో కనపడటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఇక ఈ సినిమా మార్చ్ 26న అన్ని ప్రముఖ భారతీయ బాషలలో విడుదల అవుతోంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ… స్క్రీన్ ప్లే & టేకింగ్, కెమెరా వర్క్ విషయంలో మలయాళం ఇండస్ట్రీ మనకంటే ఒక 5 ఏళ్ళు ముందు ఉన్నది..! అనే నిజం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All