Homeటాప్ స్టోరీస్"ఆ మూడు సినిమాలు ఆడకపోవడం నా తప్పా": మణిశర్మ

“ఆ మూడు సినిమాలు ఆడకపోవడం నా తప్పా”: మణిశర్మ

"ఆ మూడు సినిమాలు ఆడకపోవడం నా తప్పా": మణిశర్మ
“ఆ మూడు సినిమాలు ఆడకపోవడం నా తప్పా”: మణిశర్మ

మెలోడీ బ్రహ్మ మణిశర్మ నిన్న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి స్పందించారు. ప్రస్తుతం మణిశర్మ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇరగదీస్తున్నాడు అనే చెప్పాలి. గతేడాది ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ తో సూపర్ చార్ట్ బస్టర్ ను అందించాడు మణిశర్మ. దాంతో మళ్ళీ మణిశర్మను కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ మెలోడీ బ్రహ్మ చేతిలో దాదాపు పది సినిమాల దాకా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెల్సిందే. మణిశర్మ సంగీతం అందించిన రెడ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ – దేవా కట్టా చిత్రానికి కూడా మణినే సంగీతం అందిస్తున్నాడు. వెంకటేష్ నారప్ప, గోపీచంద్ సీటిమార్ తో కలిపి మరో నాలుగైదు చిత్రాలకు మణిశర్మ పనిచేస్తున్నాడు. ఇలా సూపర్ బిజీగా ఉన్న మణిశర్మ గతంలో తనను ఎవరూ సినిమాల కోసం కన్సిడర్ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసాడు.

- Advertisement -

నేను ఆఖరుగా శక్తి, తీన్మార్, ఖలేజా వంటి టాప్ సినిమాలకు పనిచేసాను. వాటికి నా శక్తి మేరకు మంచి ఆల్బమ్ ఇచ్చాను. మ్యూజికల్ గా ఆ మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలు ఆడలేదు. అందులో నా తప్పు ఏముంది? ఈ మూడు సినిమాలు ఆడకపోవడం వల్లే నాకు అవకాశాలు తగ్గిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేసాడు మణిశర్మ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All