Homeఎక్స్ క్లూసివ్మణికర్ణిక ట్రైలర్ టాక్

మణికర్ణిక ట్రైలర్ టాక్

Manikarnika trailer talk
Kangana Ranaut

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ” మణికర్ణిక ”. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల చేసారు . ట్రైలర్ చూస్తుంటే మణికర్ణిక సంచలన విజయం సాధించడం ఖాయమనే అనిపిస్తోంది . ఝాన్సీ పాత్రలో వివాదాస్పద భామ కంగనా రనౌత్ అద్భుతంగ నటించి సినిమాపై అంచనాలను పెంచేసింది .

కంగనా చేసిన పోరాట దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి . ఆ దృశ్యాలలో కంగనా రనౌత్ పడిన కష్టం యిట్టె తెలిసిపోతుంది . అయితే క్రిష్ దర్శకత్వం వహించినప్పటికీ ఇంకా కొంతభాగం షూటింగ్ ఉండగానే క్రిష్ దర్శకత్వం నుండి తప్పుకున్నాడు దాంతో బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ ని కంగనానే పూర్తిచేసింది . ట్రైలర్ కి అద్భుత స్పందన వస్తుండటంతో మణికర్ణిక చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . ఇక ఈ చిత్రాన్ని జనవరి 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Manikarnika trailer talk

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All